Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మెడికల్ ఆఫీసర్ వెంకట ప్రకాశ్
నవతెలంగాణ-చండ్రుగొండ
పరిమితికి మించి వైద్యం చేస్తే చర్యలు తప్పవని స్థానిక ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి వెంకట ప్రకాశ్ అన్నారు. శనివారం గ్రామీణ వైద్యులతో సమావేశం ఏర్పాటు చేసి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో రెండు రోజుల కంటే ఎక్కువ రోజులు జ్వరం వచ్చే రోగుల వివరాలను ఏఎన్ఎంలకు ఇతర వైద్య సిబ్బందికి తెలియజేయాలన్నారు. ఈ సమావేశంలో గ్రామీణ వైద్యులు దయాకర్, షాబీర్, ఆనంద్ రావు, నయీమ్, నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు.