Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకాలు
నవతెలంగాణ-ఇల్లందు
రాష్ట్రంలో గిరిజన అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తోందని జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య అన్నారు. క్యాంప్ కార్యాలయంలో శనివారం సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు. గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ జీవో విడుదల చేయడం సంతోషకరమన్నారు. దీని మూలంగా గిరిజనులకు ప్రయోజనం చేకూరనున్నదని అన్నారు. కార్యక్రమంలో సర్పంచులు ఇందిరానగర్ పాయం లలిత, బాలాజీనగర్ పాయం స్వాతి, బుజ్జాయిగూడెం చీమల వెంకటేశ్వర్లు, సుదిమల్ల కల్తి పద్మ, వెంకట నర్సు, వీరభద్రం, తదితరులు పాల్గొన్నారు.
బూర్గంపాడు : దసరా పండగ కానుకగా 10 శాతం రిజర్వేషన్ ఇవ్వడంపై గిరిజనుల కల సాకారం కావడంతో శనివారం మండలం సారపాక గాంధీనగర్లో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. శనివారం తండా నాయక్ బర్మావత్ కిషన్ నాయక్ పిలుపు మేరకు మార్కెట్ బోర్డు డైరెక్టర్ బాణోతు శ్రీను నాయక్ అధ్యక్షతన జరిగిన పాలాభిషేకం కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గోపిరెడ్డి రమణారెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా లంబాడీ కుల పెద్దల చేతులు మీదుగా కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడారు. అదేవిధంగా తండా నాయక్ కిషన్ నాయక్ మాట్లాడుతూ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తండా సేక్సింది హర్జ నాయక్, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్, టౌన్ అధ్యక్షుడు కొనకంచి శ్రీను, మాజీ ఎంపీటీసీ సభ్యులు భూక్య భీమ్లా, మాజీ వార్డు సభ్యులు మూడ్ శ్రీను నాయక్, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
మణుగూరు : గిరిజనులకు పది శాతం రిజర్వేషన్లు పెంచిన ఘనత కేసిఆర్దేనని కేసీఆర్ గిరిజన బాంధవుడు అని టీఆర్ఎస్ సీనియర్ నాయకులు గిరిజన నేత వట్టం రాంబాబు అన్నారు. శనివారం టీఆర్ఎస్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు పెంచినందుకు హర్షం వ్యక్తం చేశారు. అనంతరం కేసీఆర్కు పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ధరావత్ రమ, సకిని బాబురావు, హరికృష్ణ, రజిత, సరోజ, గణేష,్ విజరు, భవాని, రమేష్, సతీష్, తదితరులు, పాల్గొన్నారు.
దుమ్ముగూడెం : సీఎం కేసీఆర్ ఆదివాసీలకు ఇచ్చిన మాట ప్రకారం జీవో నెంబర్ 33 తీసుకువచ్చి 6 శాతం ఉన్న రిజర్వేషన్ను 10శాతం పెంచుతూ జీవో జారీ చేసి అమలులోకి తీసుకు వచ్చి గిరిజన నిరుద్యోగులకు మేలు చేశారని ఎంపీపీ రేసు లక్ష్మి అన్నారు. శనివారం ఎంపీపీ కార్యాలయంలో గిరిజన ప్రజాప్రతినిధుల సమావేశంలో ఎంపీపీ రేసు లక్ష్మీ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల ప్రధాన కార్యదర్శి కణితి రాముడు, ఉపాధ్యక్షులు తునికి కామేశ్వరరావు, జడ్పీటీసీ సీతమ్మ, గిరిజన మహిళా ప్రజాప్రతినిధులు, సోడి జ్యోతి, సీత, కృష్ణవేణి, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
జూలూరుపాడు : గిరిజనులకు 6 శాతం నుంచి 10 శాతం రిజర్వేషన్ పెంచుతూ సీఎం కేసిఆర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా వైరా శాసనసభ్యులు లావుడియా రాములు నాయక్ ఆదేశానుసారం ఎంపీపీ లావుడియా సోనీ, జడ్పీటీసీ కళావతి ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్రపటానికి గిరిజన ప్రజా ప్రతినిధులు పాలాభిషేకం చేసి, మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు సావిత్రి, పద్మ, రాందాస్, నరసింహారావు, రాములు, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు చౌడ నరసింహారావు, ప్రధాన కార్యదర్శి నున్న రంగారావు తదితరులు పాల్గొన్నారు.
గిరిజన ఆదివాసీ సంఘాల నాయకులు అభినందనలు
ఎన్నో పోరాటలను గుర్తించి కెసిఆర్ ప్రభుత్వం గిరిజనుల రిజెర్వేషన్ పెంపు ప్రకియ అని జిల్లా ఎల్హెచ్పిఎస్ ప్రధానకార్యదర్శి గుగులోత్ కేశ్యా నాయక్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్హెచ్పిఎస్ వైరా నియోజకవర్గ ఇంచార్జి నాగేశ్వరావు నాయక్, జై ఆదివాసీ యువశక్తి జిల్లా అధ్యక్షులు సురేష్ దొర, ఎల్హెచ్పిఎస్ జిల్లా, మండల నాయకులు పాల్గొన్నారు.
గిరిజనుల ఐక్య పోరాట ఫలితమే జీఓ 33
జీఓ 33ను విడుదల చేయడం హర్షణీయమని తెలంగాణ గిరిజన సంఘం జిల్లా సహాయ కార్యదర్శి భాణోత్ మధు అన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్కు ధన్యవాదములు తెలియజేశారు.