Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రస్తుతానీకైతే ప్రజల్లో ఉందాం....
- అయోమయంలో మాజీలు...
నవతెలంగాణ-కొణిజర్ల
ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించేదరూ రామా అనే పాటను తలపిస్తోంది వైరా నియోజకవర్గంలో ని రాజకీయ నాయకుల పరిస్థితి. నియోజకవర్గంలో రాబోయే రోజుల్లో రాజకీయ సమీకరణాలు మారే ఆవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో ఇప్పటికే అధికార పార్టీలో టిక్కెట్ గుబులు మొదలైందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కారణం టీఆర్ఎస్తో సీపీఐ పొత్తు కుదరడం వలనేనటా. ప్రస్తుతం మునుగోడులో ఉప ఎన్నిక ఉన్న క్రమంలో సీపీఐ అధికార టిఆర్ఎస్కి మద్దతు ఇవ్వడంతో ఒక్కసారిగా నియోజకవర్గంలో రాజకీయం వేడిక్కింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సైతం సీపీఐ టీఆర్ఎస్కు మద్దతు ఇస్తున్నట్లు సంకేతాలు ఇస్తోంది. ఈ క్రమంలో నియోజకవర్గం అధికార పార్టీలో ఉన్న మాజీలు వైరా సీటు నాకే వస్తుందంటే నాకే వస్తుందంటూ ఎవరికివారు తమ తమ అనుచరులతో కలిసి సభలు సమావేశాలు, శూభాకార్యాలు, కర్మలు లాంటి కార్యక్రమాల్లో అడపాదడపా పాల్గొంటున్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వైరా సీట్ సీపీఐకి వెళ్లే అవకాశం ఉందని స్పష్టమైన సంకేతాలు అధికార పార్టీలో ఉన్న ఆశావహులకు అర్థమౌవడంతో ఏమాత్రం మింగుడు పడటం లేదటా. దీంతో వేచిచూద్దామా.. లేక ప్రజలకు అందుబాటులో ఉంటూ.. పరిస్థితులకు అనుగుణంగా జంప్ చేద్దామా అనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఎవరికి టికెట్ వరిస్తుందో.. ఎవరు ఏ పార్టీ నుంచి ఏ పార్టీకి జంప్ చేస్తారో అనేది వేచిచూడాలి..