Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐద్వా జిల్లా కార్యదర్శి మాచర్ల భారతి
నవతెలంగాణ-కల్లూరు
పెండ్లి చేసుకుంటానని మయమాటలు చెప్పి స్వప్నను మోసం చేసి ముఖం చాటేసిన హరికృష్ణ మొండి పట్టు వీడి పెండ్లి చేసుకోవాలని ఐద్వా జిల్లా కార్యదర్శి మాచర్ల భారతి డిమాండ్ చేసారు. శనివారం మండల పరిధిలోని మర్లపాడు గ్రామంలో గత 10 రోజులు గా ప్రియుడు ఇంటి ముందు మౌన దీక్ష చేస్తున్న స్వప్నను పరామర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా భారతి మాట్లాడుతూ స్వప్నకు న్యాయం జరిగేంత వరకు ఆమె పోరాటానికి మద్దతుగా నిలబడుతామని అన్నారు. స్వప్నకు మాయ మాటలు చెప్పి వంచించి గర్భవతిని చేసి అబార్షన్ చేయించి ఇప్పుడు పెళ్లి చేసుకోనని అనటం ఎంతవరకు సమంజసం అని అన్నారు. హరికృష్ణ వెంటనే స్వప్నను వివాహం ఆడాలని లేకపోతే ఐద్వా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున స్వప్న తరపున పోరాటం చేస్తామన్నారు. సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే మర్లపాడు గ్రామానికి విచ్చేసి తన కార్యక్రమాన్ని నిర్వహించుకుని వెళ్లారని 10 రోజులకు పైగా దీక్ష చేస్తున్న బాధితురాలైన స్వప్నను పరామర్శించకపోవడం దురదృష్టకరమన్నారు. ఈ పోరాటంలో ఎమ్మెల్యే చొరవ తీసుకోవాలని దాంతో స్వప్నకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కల్లూరు ఇద్వా మండల కార్యదర్శి తన్నీరు కృష్ణవేణి, తదితర మహిళలు పాల్గొన్నారు.