Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నోరు అదుపులో పెట్టుకోండి
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి కనకయ్య
నవతెలంగాణ-దమ్మపేట
కమ్యూనిస్టు పార్టీలపై అవాకులు, చెవాకులు పేలుతున్న కాంగ్రెస్ నాయకులు అడ్డగోలు వాగుళ్ళను ఆపాలని లేని పక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని కాంగ్రెస్ నాయకుల్లారా ఖబర్ధార్ అంటూ సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య పేర్కొన్నారు. శనివారం మండల పరధిలోని నాచారం గ్రామంలో సీపీఐ(ఎం) అశ్వారావుపేట నియోజకవర్గ ముఖ్యనాయకుల సమావేశం జిల్లా కమిటీ సభ్యులు దొడ్డా లకిëనారాయణ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కనకయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు మునుగోడు ఉప ఎన్నికలలో కమ్యూనిస్టు పార్టీలు టీఆర్‌యస్ పార్టీకి మద్దతు ఇవ్వడంపై కాంగ్రెస్ పార్టీ నాయకులు అవాకులు, చెవాకులు పేలడాన్ని తీవ్రంగా ఖండించారు. తొలుత కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ ఇళ్ళును చక్కపెట్టుకొని ఇతరులకు సలహాలివ్వాలని కాంగ్రెస్ పార్టీలో అనేక గ్రూపులున్నాయని పేర్కొన్నారు. భారత దేశానికి ప్రధాన శత్రువుగా ఉన్న మతతత్వ బీజేపీ పార్టీని ఎదుర్కోవడంలో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా విఫలమైందంటూ తెలిపారు. మునుగోడులో ఉప ఎన్నిక రావడానికి కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత కుమ్ములాటలే ప్రదాన కారణమని పేర్కొన్నారు. కేంద్రంలో బీజేపీ నరేంద్రమోడీ ప్రభుత్వ విధానాలపై నిజాయితీ పోరాటం చేయకుండా మతతత్వ శక్తులు పెరగటానికి దేశ సంపదను లూఠీ చేసి కార్పొరేట్ శక్తులకు దేశాన్ని అమ్ముతూ ఉంటే చేష్టలుడికి కాంగ్రెస్ పార్టీ చూడటం తప్ప చేసిందేమీ లేదని, ఆర్‌యస్‌యస్ బీజేపీ పార్టీల మతతత్వానికి మతోన్మాదానికి వ్యతిరేకంగా నిజాయితీగా నిజమైన పోరాటం చేసేది కమ్యూనిస్టులే అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో పోడు భూములకు కమిటీల పేరుతో కాలయాపన చేయకండా అర్హతలున్న ప్రతి పోడు సాగుదారుడికి పట్టాలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా సెక్రటరేట్ నెంబర్ కొక్కెరపాటి పుల్లయ్య, ములకలపల్లి, దమ్మపేట అశ్వారావుపేట పార్టీ మండల కార్యదర్శులు ముదిగొండ రాంబాబు మోరంపూడి శ్రీనివాసరావు, బుడితి చిరంజీవి నాయుడు, పొడియం వెంకటేశ్వర్లు, రావుల శోభన్‌బాబు, నిమ్మల మధు, మోరంపూడి కేశవరావు, జానయ్య, తదితరులు పాల్గొన్నారు.