Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి బి.మధు
నవతెలంగాణ-భద్రాచలం
రాష్ట్రంలో 76 రకాల షెడ్యూల్డ్ పరిశ్రమలలో కనీసవేతనాల జీవోలను సవరించి కొత్త జీవోలను విడుదలచేయాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి బి.మధు డిమాండ్ చేశారు. సీఐటీయూ జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశం భద్రాచలంలో జిల్లా అధ్యక్షులు యం.వి.అప్పారావు అధ్యక్షతన శనివారం జరిగిన సమావేశంలో బి.మధు పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక వేత్తలు, యజామాన్యాం అడుగులకు మడుగులొత్తుతుందని విమర్శించారు. యాజమాన్యాల లాభాలకోసం కార్మికులకు చట్ట బద్దంగా రావల్సిన వేతనాల జీవోలు ఇవ్వకుండా ప్రభుత్వం శ్రమదోపిడికి పాల్పడుతుందని విమ ర్శించారు. పెరుగుతున్న ధరలను ప్రభుత్వాలు అదుపుచేయటంలో విఫలం చెందుతున్నాయని అన్నారు. కనీస వేతనాల జీవోలు ఇవ్వటంవలన ప్రభుత్వానికి ఏవిధంగాను ఆర్ధికభారం వుండదని అయినప్పటికీ ప్రభుత్వం కనీసవేతనాల జీవోలను ఇవ్వటంలేదని అన్నారు. ఇచ్చిన 5 జీవోలను కూడా గెజిట్ చేయకపోవటంవలన కార్మికులు తీవ్రంగా నష్ట పోతున్నారని తెలిపారు. కొత్త జీవోలు ఇవ్వకప వటం వలన రాష్ట్ర వ్యాప్తంగా వేలకోట్ల రూపాయాలు వేతనాలు నష్ట పోయారని గుర్తు చేశారు. ఇప్పటికైన ప్రభుత్వం జీవోలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గ్రామపంచాయితీ కార్మికులకు కనీసవేత నాలు రూ.26వేలు ఇవ్వాలని, మల్టీపర్పస్ విధానం రధ్దుచేయాలని, మద్యాహ్న భోజన కార్మికులకు ప్రభుత్వం పెంచిన రూ.2000 వేతనాలు చెల్లిం చాలని డిమాండ్ చేశారు. నవంబర్ 1, 2 తేదీలలో సీఐటీయూ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎ.జె.రమేష్, జిల్లా ఆఫీస్ బేరర్స్ జి.పద్మ, కె.బ్రహ్మాచారి, ఈసం.వెంకటమ్మ, గద్దల శ్రీను, యర్రగాని కృష్ణయ్య, యర్రశెట్టి వెంకటరామారావు తదితరులు పాల్గొన్నారు.