Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మణుగూరు
దసరా వేడుకల ఏర్పాట్లలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా చర్యలు చేపట్టాలని ఏరియా జనరల్ మేనేజర్ డి.వెంకటేశ్వర రెడ్డి అన్నారు. శనివారం సంబంధిత అధికారులతో కలిసి పివి కాలనీ భద్రాద్రి స్టేడియంలో జరుగుతున్న బతుకమ్మ, దసరా వేడుకల ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్బంగా భద్రాద్రి స్టేడియంలో బతుకమ్మ, దసరా వేడుకల ఏర్పాట్లు చేస్తున్న ఆయా విభాగాల అధికారులతో ఆయన మాట్లాడుతూ అక్టోబర్ 3వ తేదీన జరుగనున్న సద్దుల బతుకమ్మ, 5వ తేదీన జరిగే దసరా వేడుకలకు భారీ ఎత్తున సింగరేణియులు వారి కుటుంబ సభ్యులు, స్థానిక పురజనులు అధిక సంఖ్యలో రావటం ఆనవాయితీగా కొనసాగుతుందన్నారు. కావునా వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓటు జీఎం డి.లలిత్ కుమార్ నర్సిరెడ్డి, వెంకటేశ్వర్లు, డీజీఎం పర్సనల్ సలగల రమేష్, శేషగిరి రావు, సీనియర్ పర్సనల్ అధికారులు సింగు శ్రీనివాస్, వి.రామేశ్వర రావు, సీనియర్ సెక్యూరిటీ అధికారి ఎండి షబీరుద్దీన్, టీబీజీకేఎస్ యూనియన్ నాయకులు వి.ప్రభాకర్ రావు, కోట శ్రీనివాస్ రావు, స్పోర్ట్స్ సుపేర్వైజర్ జాన్ వెస్లీ తదితరులు పాల్గొన్నారు.