Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాసాని అయిలయ్య
నవతెలంగాణ-కొత్తగూడెం
కొమరం భీం కాలనీలో గుడిసెలు వేసుకున్న పేదలందరికీ ఇండ్ల స్థలాలు పంచి ఇచ్చే వరకూ పోరాటం ఆగదని రైతు సంఘం రాష్ట్ర నాయకులు కాసాని అయిలయ్య, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు అన్నవరపు కనకయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని హెచ్చరించారు, శనివారం చుంచుపల్లి మండలం, రామాంజనేయ కాలనీ పంచాయతీ పరిధిలోని కొమరం భీం కాలనిలో తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం, వ్యకాస సంఘాల ఆధ్వర్యంలో గుడిసెలు వేసుకున్న పేదలతో సభ జరిగింది. ఈ సభలో నాయకులు పాల్గొని మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా అనేక మంది పేదలు ఇండ్లు వేసుకున్నారని, ఎండ, వానా, చలికి ఇక్కడే ఉంటూ జీవనం సాగిస్తున్నారన్నారు. రెండు సంవత్సరాలు అవుతున్నప్పటీకి ప్రభుత్వ పేదల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని చెప్పారు. వెంటనే ఇక్కడ ఇండ్లు వేసుకున్న పేదలందరికీ ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనేక ప్రాంతాలకు చెందిన పేదలు జిల్లా కేంద్రంలో బతుకుదేరువు కోసం వచ్చి జీవిస్తున్నారని, వారికి ఇంటి స్థలం ఇచ్చి ఇండ్లు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చుంచుపల్లి మండలంలోని 137/1, 137/12, 13,14లో ఉన్న ప్రభుత్వ భూములను ఎంజారు మెంట్ సర్వే చేయాలని డిమాండ్ చేశారు. గుడిసెలు వేసుకున్న పేదలకు అండగా పోరాడుతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు వజ్జ సురేష్, వ్యకాస జిల్లా అధ్యక్షులు రేపాకుల శ్రీనివాస్, సీఐటీయూ జిల్లా నాయకులు లిక్కి బాలరాజు, భూక్యా రమేష్, డి.వీరన్న తదితరులు పాల్గొన్నారు.