Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అదనపు కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు
నవతెలంగాణ-కొత్తగూడెం
దేశంలో యువతతో పాటు వయోవృద్ధుల జనాభా పెరుగుతోందని, చిన్న చిన్న కుటుంబ వ్యవస్థ పెద్దలను పట్టించుకోకపోవడం, వారు నేర్పె నీతి కధలు, నైతిక విలువలు, బాధ్యతలు ఉద్బోదించేవారు లేరని, దీనితో యువత, పిల్లలు చెడు మార్గాలు పడుతున్నారని, కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నాము అవుతున్నాయని అదనపు కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవ సందర్భంగా వయోవృద్ధుల వేడుకలు స్థానిక కమ్మ కళ్యాణ మండపములో జిల్లా సంక్షేమ శాఖ అధికారి అర్.వరలక్ష్మీ అధ్యక్షతన జరిగిన వేడుకలలో ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రులు, వయోవృద్ధుల పోషణ సంరక్షణ చట్టంపై అవగాహణ కార్యక్రమాలు చేపట్టడం, హెల్ప్ లైన్ 14567 సేవలు, ఆరోగ్య పరిరక్షణపై సూచనలు చేయడం జరిగిందని తెలిపారు. 90 ఏండ్లు దాటిన వారిని ఈ సందర్భంగా సన్మానించారు.