Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుమ్ముగూడెం
కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ ఆదేశాల మేరకు శనివారం మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో సాయంత్రం మహిళా ప్రజాప్రతినిధులు, అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ ఆట పాట ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మహిళా ప్రజాప్రతినిధులు, అధికారులు తీరొక్క పూలతో తయారు చేసిన బతుకమ్మలను పేర్చి ఆటపాటలతో సందడి చేశారు. ఎంపీడీవో చంద్రమౌళి మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ఘనంగా నిర్వహించుకునే బతుకమ్మ వేడుకలను అధికారికంగా నిర్వహించడం జరిగింది అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రేసు లక్ష్మి, జెడ్పీటీసీ సీతమ్మ, ఎంపీఓ ముత్యాల రావు, ఈజీఎస్ ఏపీఓ సుకన్య, టీఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి కనితి రాముడు, ఉపాధ్యక్షులు కామేష్తో పాటు మహిళా గ్రామ పంచాయతీ సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యదర్శులు, ఈజీఎస్ సిబ్బంది, సీఐ దోమల రమేష్ తదితరులు పాల్గొన్నారు.