Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రిన్సిపాల్‌ను సత్కరించిన అధ్యాపకులు విద్యార్థులు
నవతెలంగాణ-ఇల్లందు
పట్టణంలోని స్ధానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలకు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తెచ్చిన ప్రిన్సిపాల్ శ్రీ రంగం రామలింగేశ్వర రావును శనివారం జరిగిన ఒక కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు సన్మానించారు. పూలమాలలు వేసి శాలువాలతో ఘనంగా సత్కరించారు. కళాశాలలో పదవి బాధ్యతలు చేపట్టి 5 సంవత్సరాలు పూర్తి చేసుకొన్నారు. చేసిన కళాశాల అభివృద్ధిని గుర్తు చేస్తూ అభినందించారు. ప్రభుత్వ కళాశాలకు రాష్ట్రస్థాయి ప్రథమ ర్యాంకు రావడం పట్ల రాజకీయ పార్టీల నేతలు, మేధావులు, పట్టణ ప్రముఖులు, సామాజిక వర్గాల ప్రతినిధులు ప్రిన్సిపాల్ రామలింగేశ్వరరావు కృషిని, పట్టుదలను, అంకిత భావాన్ని కొనియాడుతూ అభినందనలు తెలుపుతున్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపక, అద్యపాకేతర సిబ్బంది పాల్గొన్నారు.