Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తహసీల్దార్‌కు సీపీఐ(ఎం) వినతి
నవతెలంగాణ-భద్రాచలం
నష్టపరిహారం అందని గోదావరి వరద బాధితులకు వెంటనే నష్టపరిహారం అందివ్వాలని, నష్టపరిహారం అందించిన వరద బాధితుల లిస్టును బహిర్గతం చేయాలని సీపీఐ(ఎం) పట్టణ కమిటీ తహసీల్దార్‌కి శనివారం వినతి పత్రం అందించారు. గోదావరి వరదల్లో నిండా మునిగిన అనేకమంది బాధితులకు నష్టపరిహారం అందలేదని నష్టపరిహారం కోసం బాధితులు గత మూడు నెలలుగా నష్టపరిహారం ఇవ్వాలని అధికారుల చుట్టూ, ప్రభుత్వ కార్యాలయాలు చుట్టు తిరుగుతున్న సమస్య పరిష్కారం కావడం లేదని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎంబీ నర్సారెడ్డి, పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు బండారు శరత్ బాబులు విమర్శించారు. సుభాష్ నగర్ కాలనీ అయ్యప్ప కాలనీ కొత్త కాలనీలలోని గోదావరి వరదలో మునిగిన కొంతమందికి నష్టపరిహారం అందకపోవడంతో అనేకసార్లు అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని అన్నారు. ఇండ్లు మునిగిన వారికి కాకుండా అధికార పార్టీ నేతలు తప్పుడు పేర్లు నమోదు చేయించారని వరద బాధితులే విమర్శిస్తున్న సంగతి వారు గుర్తు చేశారు. సర్వం కోల్పోయి ముంపు గురైన కుటుంబాలకు నష్టపరిహారం అందే వరకూ పోరాటం సాగిస్తామని అన్నారు.