Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దుమ్ముగూడెం : జాతి పిత మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని శ్రీ లాల్ బహుదూర్ శాస్త్రి జన్మదిన వేడుకలను దుమ్ముగూడెం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. లక్ష్మీ నగరం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం దుమ్ముగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు ,పాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు లంక శ్రీనివాసరావు, సీనియర్ నాయకులు శీరపు అప్పల రెడ్డి, బైరెడ్డి సీతారామారావు, మండల యువజన నాయకులు తెల్లం హరికృష్ణ, కనుబుద్ది దేవా, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
చండ్రుగొండ : మహాత్ముని ఆశయాలను కొనసాగిస్తామని ఎంపీపీ బానోత్ పార్వతి పిలుపునిచ్చారు. ఆదివారం బస్టాండ్ సెంటర్లో ఆర్యవైశ్య సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షులు పసుపులేటి శేషగిరిరావు, ఆర్యవైశ్య సంఘం సభ్యులు కుక్క డప్పు హరిబాబు, రామారావు, వనమా శీను, సంక కపాకర్, రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు.
భద్రాచలం : బ్రిటిష్ వారిని ఎదిరించి మన దేశాన్ని చేజిక్కించుకున్న మహౌన్నత వ్యక్తి జాతిపిత మహాత్మా గాంధీ అని ఐటీడీఏ సహాయ ప్రాజెక్టు అధికారి డేవిడ్ రాజ్ అన్నారు. ఆదివారం ఐటిడిఏ సమావేశం మందిరంలో మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డీడీ రమాదేవి పరిపాలన అధికారి భీమ్‌తో కలిసి గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఏసీఎంవో రమణయ్య, ఐటీడీఏ మేనేజర్ ఆదినారాయణ, వివిధ విభాగాలకు చెందిన ఐటీడీఏ పర్యవేక్షకులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో : గాంధీ జయంతి, లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి వేడుకలు ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. స్థానిక చప్ట దిగువ మహాత్మాగాంధీ విగ్రహం జరిగిన కార్యక్రమంలో వద్ద జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు చారుగుళ్ల శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. యువజన సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శి కోశాధికారి కొత్తా రామకృష్ణ, రేపాక శ్రీనివాసరావు, జివి, జిల్లా యువజన సంఘం అధ్యక్ష కోశాధికారి, చెంచుసుబ్బారావు, సాయి తదితరులు పాల్గొన్నారు.
ఆల్ పెన్షనర్స్ కార్యాలయంలో : పట్టణంలోని పాత ఎల్ఐసీ ఆఫీసు రోడ్డులోని ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ కార్యాలయంలో గాంధీజీ, లాల్ బహు దూర్ శాస్ట్రీ జన్మదిన సందర్భంగా గాంధీ, శాస్ట్రీ చిత్ర పటాలకు పూలమాలలను అధ్యక్షుడు బందు వెంకటేశ్వరరావు, రాష్ట్ర భాద్యులు ఎంవీఎస్ నారాయణ, ప్రధాన కార్యదర్శి కె.ఎస్.ఎల్.వి.ప్రసాద్, డి.కృష్ణమూర్తి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎంవీఎస్ నారాయణ, బదరినాధ్, నాళం సత్యనారాయణ, ఆంజనేయశాస్ట్రీ, తదితరులు వారి త్యాగాల గురించి వివరించారు. పెన్షనర్స్ అంతా చిత్రపటాలను పూలతో నివాళులర్పించారు. సుబ్బయ్య చౌదరి, శివప్రసాద్, మురళీ కృష్ణ, మాదిరెడ్డి రామ్మోహనరావు, ఎస్.సుబ్బారావు, ఏటకాని సత్యనారాయణ, ఐలయ్య, పెద్ద సాయి తదితరులు పాల్గొన్నారు.
టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో : టీఎన్జీవోస్ ప్రెసిడెంట్ డెక్క నరసింహారావు, సెక్రెటరీ గగ్గురి బాలకృష్ణ ఆధ్వర్యంలో వారి కార్యాలయంలో ఆదివారం గాంధీ జయంతి సందర్భంగా గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ట్రెజరర్ పడిన నరసింహారావు, ఉపాధ్యక్షులు పసుమర్తి అపర్ణ, ఈలప్రోలు కృష్ణ, కోటిపల్లి రమేష్, సత్యనారాయణ, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో : పాత మార్కెట్ నందు గల గాంధీ విగ్రహానికి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సరేళ్ళ నరేష్ అధ్యక్షతన కాంగ్రెస్ నాయకులు పూలమాలవేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా కాంగ్రెస్ ఎస్సి సెల్ అధ్యక్షులు చింతరేల రవికుమార్, ఎక్స్ గ్రంధాలయ చైర్మన్ భోగాల శ్రీనివాసరెడ్డి మాట్లా డారు. ఇందుల బుచ్చిబాబు, బంధం శ్రీనివాస్ గౌడ్, ఉడత రమేష్, లక్ష్మణ్ యూత్ కాంగ్రెస్ నాయకులు చింతరాల సుధీర్, ప్రతిప్ తదితరులు పాల్గొన్నారు.
పినపాక : గాంధీ జయంతి సం దర్భంగా మండల వ్యాప్తంగా అన్ని ప్రభు త్వ, ప్రైవేట్ కార్యాలయాలలో, గ్రామపంచాయతీలలో, పార్టీ కార్యాలయాలలో నిర్వహించారు. చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఆళ్ళపల్లి : అహింస అనే ఆయుధంతో మహాత్మా గాంధీ స్వాతంత్య్రం తెచ్చిన గాంధీజీ మార్గంను నాయకులు, యువత అనుసరించాలని ఎస్సై రతీష్ అన్నారు. ఆదివారం పోలీస్ స్టేషన్లో గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. తొలుత బాపూజీ చిత్ర పటానికి ఆయన పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ వెంకట్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్లు కృష్ణమూర్తి, వెంకటేశ్వర్లు, నాగేశ్వరరావు, కానిస్టేబుల్ శ్రీనివాస్, మహేష్, తదితరులు పాల్గొన్నారు.
ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆళ్ళపల్లి (గుండాల) : గుండాల మండల కేంద్రములో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షుడు మానాల వెంకటేశ్వర్లు గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి, నివాళులర్పించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా స్థానిక తహసీల్దార్ నాగదివ్య, సీఐ కరుణాకర్ హాజరై, కేక్ కట్ చేశారు. ప్రతి సంవత్సరం ఆర్యవైశ్య సంఘం తరుపున జాతిపిత జయంతి వేడుకలను నిర్వహిస్తామని మానాల వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీవో హజరత్ వలి, ఉప సర్పంచ్ మానాల ఉపేందర్, మానాల నారాయణమూర్తి, గౌరిశెట్టి సత్యనారాయణ, ప్రభాకర్, తవిడిశెట్టి నాగరాజు, రాము, తదితరులు పాల్గొన్నారు.
జూలూరుపాడు: టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నందు పార్టీ అధ్యక్షుడు చౌడం నరసింహారావు ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లావుడియా సోనీ, జిల్లా నాయకులు యల్లంకి సత్యనారాయణ, యదళపల్లి వీరభద్రం, మండల ప్రధాన కార్యదర్శి నున్న రంగారావు, రాంబాబు, నాగేశ్వరరావు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.
కరకగూడెం : గాంధీ జయంతి వేడుకలను ఆదివారం మండలంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీజీ విగ్రహానికి మాజీ జడ్పీ చైర్మన్, ఎమ్మెల్యే చందా లింగయ్య, కాంగ్రెస్ నాయకులు గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అద్యక్షుడు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్, గాంధీ స్మారక ట్రస్ట్ మేనేజర్ నాగబండి వేంకటేశ్వర్లు, గ్రామస్తులు, యువత, తదితరులు పాల్గొన్నారు.
బూర్గంపాడు : టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పార్టీ మండల అధ్యక్షులు గోపిరెడ్డి రమణారెడ్డి అధ్యక్షతన వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జెడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత హాజరయ్యారు. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి కొబ్బరి కాయ కొట్టారు. కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి జక్కం సుబ్రమణ్యం, పట్టణ అధ్యక్షులు మొహమ్మద్ సోహైల్ పాషా, ఏఎంసీ డైరెక్టర్ శ్రీను నాయక్, మాజీ జెడ్పీటీసీ భూపల్లి నరసింహారావు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
భద్రాచలం : గాంధీ అడుగుజాడల్లో నడవడమే మనం గాంధీకి ఇచ్చే ఘన నివాళి అని భద్రాచలం వాసవి క్లబ్ గ్రేటర్ మాజీ అధ్యక్షులు రేపాక సాయి అఖిల్ అన్నారు. పట్టణంలోని పాత మార్కెట్ సెంటర్లో ఉన్న గాంధీ విగ్రహానికి ఆయన పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించి, మాట్లాడారు.
మణుగూరు : గాంధీజీ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షులు గురజాల గోపి ఆధ్వర్యంలో చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా నాయకులు మాట్లాడారు. కార్యక్రమంలో ఎండి షరీఫ్, సీనియర్ నాయకులు భూర్గులా నర్సయ్య, ముక్కెర లక్ష్మణ్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ వేణు, జనరల్ సెక్రటరీ కంపా రవి, వైస్ ప్రెసిడెంట్ కొడెం సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు