Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతులు ఐక్యతతోనే పామ్ ఆయిల్ గెలలు గిట్టుబాటు ధర సాధ్యం
- తుమ్మల నాగేశ్వరరావు
నవతెలంగాణ-అశ్వారావుపేట
ఏ సంఘం కానీ సంస్థ అయినా సమాజం హితం కోసమే పని చేయాలని, అపుడే అది మనుగడ సాగిస్తుందని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హితవు పలికారు. స్థానిక ఛాంబర్ ఆఫ్ కామర్స్ పాలక వర్గం ప్రమాణం స్వీకారానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని నూతనంగా ఎన్నికైన సంక ప్రసాద్ రావు ప్రమాణం స్వీకారం అనంతరం తుమ్మల ప్రసంగించారు. వ్యాపారం ఏదైనా వినియోగదారుడికి సరైన సేవలు అందించిన నుండే వ్యాపారులు, వినియోగదారులు ఆనందంగా ఉంటారని అన్నారు. ప్రజల్లో కొనుగోలు శక్తి ఉన్నపుడే అది ఏ వ్యాపారం అయినా వర్ధిల్లుతుంది కాంక్షించారు. అశ్వారావుపేట ప్రాంతాన్ని తాను మంత్రిగా ఉన్నప్పుడు ఎంతగానో అభివృద్ధి చేస్తానని తెలిపారు. నేను ఎక్కడున్నా నా ప్రాంతానికే మొదటి ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. ఆయిల్ పాం సాగు దారులు ఐక్యంగా ఉన్నపుడే కనీస మద్దతూ ధర సాధించడం కుదురుతుందని, ఆ దిశగా నేను కృషి చేస్తానని రైతులకు భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, ఎంపీపీ శ్రీరామమూర్తి, జడ్పీటీసీ వరలక్ష్మి, సీపీఐ(ఎం) జిల్లా నాయకులు, మాజీ సర్పంచ్ కొక్కెరపాటి పుల్లయ్య, అశ్వారావుపేట, పేరాయిగూడెం, ఊట్లపల్లి, మల్లాయిగూడెం సర్పంచ్లు రమ్య, సుమతి, జ్యోత్స్న భాయి, నారం రాజశేఖర్, ఆర్యవైశ్య ప్రముఖులు శీమకుర్తి వెంకటేశ్వరరావు, కొణిజర్ల ఉమామహేశ్వరరావు, సత్యవరపు సంపూర్ణ తదితరులు పాల్గొన్నారు.