Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జెడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర రావు
నవతెలంగాణ-కొత్తగూడెం
ప్రపంచ దేశాలన్నీ గాంధీజీ మార్గాన్ని అనుసరించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజా పరిషత్ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర రావు అన్నారు. ఆదివారం జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో మహాత్మా గాంధీ జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఈఈ సుధాకర్, చుంచుపల్లి మండల ఎంపీపీ బాదావత్ శాంతి, ఎంపీటీసీలు కూసన వీరభద్రం, కో-ఆప్షన్ సభ్యులు ఆరిఫ్ ఖాన్, ఉర్దూ ఘర్ డైరెక్టర్ ఖయ్యాం, చుంచుపల్లి ఎంపిడీఓ రమేష్, చుంచుపల్లి ఎంపీఓ సత్యనారాయణ, దిడ్డి రమన్ , జెడ్పీ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
గాంధీపథం ఆధ్వర్యంలో : గాంధీపథం ఆధ్వర్యంలో గాంధీజయంతి ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని పోస్టాఫీస్ సెంటర్లో గాంధీ పథం కన్వినర్ చింతలచెర్వు గెర్షోం ఆధ్వర్యంలో మహాత్ముని జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా గెర్షోం మాట్లాడారు. అహింసా మార్గంలో శాంతి అనే ఆయుధంతో దేశానికి స్వాతంత్య్ర ఉద్యమానికి ఊపిరి పోశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మరియమ్మ, జ్ఞాన వినోదిని, వెంకన్న, మల్లయ్య, రాజయ్య, పుల్లయ్య, రాములు, క్రిష్టఫర్, సాగర్, జోసఫ్, భాస్కర్, నర్సయ్య పాల్గొన్నారు.