Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మణుగూరు
వలస కార్మికులకు రక్షణ కల్పించాలని తెలంగాణ బిల్డింగ్, అధర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పతల నరసింహారావు డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక స్థానిక శ్రామిక భవనంలో మార్బుల్స్ టైల్స్ వర్కర్స్ యూనియన్ మండల మూడవ సభలో పాల్గొని మాట్లాడుతూ వలస కార్మికులకు చట్ట ప్రకారం వెల్ఫేర్ బోర్డులో పేర్లు నమోదు చేయాలన్నారు. లేబర్ బోర్డు గుర్తింపు కార్డులు ఇవ్వాలని, కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్ష కార్యదర్శులుగా ఎస్.కె హబీబుల్లా, వై.వెంకటేశ్వర్లు, కోశాధికారి ఈ.సాంబశివ, ఉపాధ్యక్షులు మురారి, సహాయ కార్యదర్శి ప్రదీప్, ఉపకోషాధికారి రామ్‌నాథ్, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్‌గా రామ్ నివాస్, జీతు, అబ్దుల్లా, ముఖేష్, అశోక్ కార్మికులు పాల్గొన్నారు.