Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఢిల్లీలో అవార్డు అందుకున్న కలెక్టర్
- జిల్లా ప్రజలు...అధికారుల సమిష్టి కృషి ఫలితం ఈ అవార్డు
నవతెలంగాణ-కొత్తగూడెం
స్వచ్ఛత...పరిశుభ్రత పల్లె ప్రగతి కార్యక్రమాలకు దేశస్థాయిలో మన జిల్లాకు స్వచ్చత అవార్డు లభించినట్లు కలెక్టర్ అనుదీప్ తెలిపారు. స్వచ్చ భారత్ దివాస్ సందర్భంగా ఆదివారం ఢిల్లీలో నిర్వహించిన స్వచ్చ అవార్డుల కార్యక్రమంలో కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ చేతుల మీదుగా అవార్డు తీసుకున్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వచ్ఛత, పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహణకు పెద్ద పీట వేసినట్లు ఆయన చెప్పారు. స్వచ్ఛ సర్వేక్షన్లో గ్రామీన్లో గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహణ అమలుతీరుపై దక్షిణాధి రాష్ట్రాలలో ప్రభుత్వ అధికారుల బృందం నిర్వహించిన సర్వేలో మన జిల్లాకు మూడవ స్థానం లభించినట్లు తెలిపారు. పారిశుధ్య కార్యక్రమాలు అమలు పర్యవేక్షణకు ఈ సంవత్సరం జనవరి 6వ తేదీ నుండి 9వ తేదీ వరకు అధికారుల బృందం జిల్లాలో పర్యటించినట్లు చెప్పారు. అట్టి అధికారులు పర్యటనలో ఇచ్చిన నివేదికలననుసరించి తిరిగి ఏప్రిల్ 21వ తేదీన ప్రత్యేక అధికారుల బృందం జిల్లాలో పర్యటించి అవార్డును ప్రకటించారని చెప్పారు. అధికారులు అందచేసిన నివేదిక ఆధారంగా భారత ప్రభుత్వం మన జిల్లాకు 3 స్థానం ప్రకటించారని వివరించారు. పల్లె ప్రగతిలో చేసిన అన్ని పనులకు ఫలితంగా మన జిల్లాకు అవార్డు లభించిడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. పల్లె ప్రగతి కార్యక్రమాలు నిర్వహణకు ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలు, రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజరుకుమార్ సలహాలు, సూచనలతో పాటు భాగస్వాములపైన ప్రజా ప్రతినిధులు, గ్రామ స్థాయిలో సర్పంచులు, కార్యదర్శులు, వార్డు అధికారులు, మండల స్థాయిలో ఎంపీడీఓలు, ఎంపీఓలు, మండల ప్రత్యేక అధికారులు, డీఆర్డిఓ, డీపీఓ, జడ్పీ సీఈఓలను ప్రత్యేకంగా ఆయన అభినందించారు. మన జిల్లాకు లభించిన ఈ గౌరవం మరింత బాధ్యతలను పెంచిందని ఆయన చెప్పారు. మున్ముందు జాతీయ స్థాయిలో మరిన్ని అవార్డులు సాధించాలని ఇందుకు ప్రజా ప్రతినిధులు, అధికారులు, అనధికారులు ప్రజల సహకారంతో ముందుకు పోతామని ఆయన తెలిపారు. ఈ ఆవార్డు అందుకున్న వారిలో కలెక్టర్ అనుదీప్‌తో పాటు డీఆర్డీఓ పీడీ మధుసూదన్ రాజు, జిల్లా పంచాయతీ అధికారి రమాకాంత్, ఎస్బీయం కన్సల్టెంట్స్ రేవతి, ఖాదర్ తదితరులు పాల్గొన్నారు.