Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పట్టించుకోని అధికారులు
నవతెలంగాణ-దుమ్ముగూడెం
హింసాయుతంగా భారతదేశానికి స్వేచ్ఛ స్వాతంత్య్రం తీసుకువచ్చిన జాతిపిత గాంధీజీ జయంతి సాక్షిగా మండల వ్యాప్తంగా బెల్టు షాపుల వద్ద మద్యం, విక్రయ కేంద్రాల వద్ద మాంసం విక్రయాలు యథేచ్ఛగా కొనసాగాయి. ఒక పక్క దసరా పండుగ సందర్భంగా నిర్వహించే దేవీ శరన్నవరాత్రులు, మరోపక్క బతుకమ్మ వేడుకలు, దీనికి తోడు ఆదివారం కావడంతో మాంసం ప్రియులు సైతం ఉదయం నుండే మాంసం విక్రయ కేంద్రాల వద్ద క్యూ కట్టారు. మండల కేంద్రంగా ఉన్న లక్ష్మీనగరం, ములకపాడు గ్రామాలలో మాంసం విక్రయ దారులు భయం భక్తి లేకుండా ఉదయం 10 గంటల వరకు మాంసం విక్రయాలు యథేచ్ఛగా కొనసా గించారు. పలు చోట్ల చాటు మాటు విక్రయాలు సాగించారు. దీంతో పాటు మండల వ్యాప్తంగా ఉన్న బెల్టు షాపులలో సైతం మద్యం విక్రయాలు యథేచ్ఛగా కొనసాగాయి.
పట్టించుకోని అధికారులు : గాంధీ జయంతి సందర్భంగా మద్యం మాంసం విక్రయాలు జరగకూడదని నిబంధనలు ఉన్నప్పటికీ మండల వ్యాప్తంగా మద్యం మాంసం విక్రయాలు యథేచ్ఛగా కొనసాగాయి అని చెప్పవచ్చు. వ్యాపారులకు గ్రామపంచాయతీ, రెవెన్యూ అధికారులు ముందస్తు హెచ్చరికలు జారీ చేయక పోవడం, అధికారులు పట్టించుకోకపోవడంతో విచ్చలవిడిగా మద్యం, మాంసం విక్రయాలు జోరుగా సాగాయి అనే విమర్శలు వినిపిస్తున్నాయి. కాగా విషయం తెలుసుకున్న సీఐ దోమల రమేష్ పోలీసుల సహకారంతో మద్యం మాంసం విక్రయాలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.