Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆవిష్కరించిన జిల్లా కార్యదర్శి ముత్తయ్య
నవతెలంగాణ-కొత్తగూడెం
కేవీపీఎస్ 24వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆదివారం స్థానిక కేవిపీఎస్ కార్యాలయం వద్ద 24 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా కేవిపీఎస్ జిల్లా కార్యదర్శి మెరుగు ముత్తయ్య జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కేవీపీఎస్ ఆధ్వర్యంలో అనేక పోరాటాలు, సామాజిక ఉద్యమాలు నిర్మించడం జరిగిందని తెలిపారు. సబ్ ప్లాన్, స్మశాన వాటికల జీవోలను సాదించడంలో కేవీపీయస్ చారిత్రాత్మక కృషి, పోరాటాలు చేసిందని కొనియాడారు. దళితులు ఇతర సామాజిక తరగుతుల అభ్యున్నతికి కృషిలో కేవిపీయస్ది ప్రత్యేక స్థానం ఉందన్నారు. భారత రాజ్యాంగానికి బీజేపీ నుండి పెను ప్రమాదం ఉందని అన్నారు. రాజ్యాంగాన్ని కాపాడుకోవలసిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా సహాయ కార్యదర్శి నందిపాటి రమేష్. మన్నెం మోహన్ రావు, గుర్రం రాములు సీఐటీయూ, ఆవాజ్, మహిళా సంఘం, ఎస్ఎఫ్ఐ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.