Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 1939 నాటి గ్రంథాలయం నిలబెట్టడం అభినందనీయం
- ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే
నవతెలంగాణ-ఇల్లందు
భావితరాలను విజ్ఞానవంతులుగా చేయడానికి జ్ఞాన సముపార్జనకు, ఉన్నతులుగా ఎదగడానికి గ్రంథాలయాలు విజ్ఞాన దేవాలయాలుగా ఉపయోగపడుతాయని ఎమ్మెల్యే హరిప్రియ, మార్కెట్ కమిటీ చైర్మన్ హర్సింగ్ నాయక్ అన్నారు. స్థానిక ఆమ్ బజార్లో 1939 నాటి పునఃనిర్మాణం కావించబడిన శ్రీ సీతారామాంజనేయ హిందూ వర్తక గ్రంథాలయాన్ని ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. 1939లో స్థాపించబడిన గ్రంథాలయాన్ని ఆధునికరించి పునర్నిర్మించి నిలబెట్టడం సంతోషకరమన్నారు. కృషి చేసిన అభివృద్ధి కమిటీ సభ్యులు అభినందనీయులు అన్నారు. అనంతరం మాట్లాడారు. గ్రంథాలయాలు జాతి నాగరికత సంస్కృతులకు ప్రతీకలు అన్నారు. విజ్ఞాన సంపదలకు నిలయాలని అన్నారు. పౌరులను మేధావులుగా, చైతన్యవంతులుగా వివేకులుగా తీర్చిదిద్దే సాధనాలు అన్నారు. అర్వపల్లి సీతారాములు జ్ఞాపకార్థం వారి కుమారుడు మార్గదర్శి హై స్కూల్ ప్రిన్సిపాల్ అర్వపల్లి రాధాకృష్ణ రూ.15 వేల విలువైన గ్రంథాలను బహుకరించడం అభినందనీయమన్నారు. పవిత్ర దేవాలయాల వంటివి గ్రంథాలయాలన్నారు. అనంతరం గ్రంథాలయ సంస్థ జిల్లా అధ్యక్షులు డి. రాజేందర్, మున్సిపల్ చైర్మన్ వెంకటేశ్వరరావు,వైస్ చైర్మన్ జానీ, రాష్ట్ర రైతు బంధు సలహాదారు పి.మాధవరావు ప్రసంగించారు ప్రసంగించారు.
ఎమ్మెల్యే హరిప్రియ హరిసింగ్లకు ఘన సన్మానం
శ్రీ సీతారామాంజనేయ హిందు వర్తక గ్రంథాలయ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మురళీధర్, జుగల్ కిషోర్ ఖండేల్వాల్, కోశాధికారి కొప్పురావూరు భాస్కరరావులు ఎమ్మెల్యేకు పుష్పగుచ్ఛాలు ఇచ్చి శాలువా కప్పి మెమెంటోతో సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో అభివృద్ధి కమిటీ సభ్యులు డాక్టర్ సుధాకర్, చంద్ర చంద్రశేఖర్, గౌడ్ శెట్టి పురుషోత్తం, స్థానిక కౌన్సిలర్ పోబోలు స్వాతి, పట్టణ ప్రముఖులు సురేష్ లాహౌటి, సునీల్ కుమార్, సుధీర్ తోత్ల, మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు.