Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య
నవతెలంగాణ- సత్తుపల్లి
గాంధీజీ బ్రిటిష్ పాలకులపై పదునైన అహింస ఉద్యమాన్ని చేపట్టి తెల్లదొరలు దేశం విడిచి పారిపోయేలా చేసిందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. ఆదివారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో గాంధీ, లాల్‌బహదూర్‌శాస్త్రి జయంతి వేడుకలను ఘనంగా జరిపారు. కార్యాలయం ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సండ్ర మాట్లాడారు. సత్యం, ధర్మం, అహింస, సహాయ నిరాకరణ గాంధీ నమ్మే సిద్ధాంత మూలాలన్నారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మెన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, మున్సిపల్ ఛైర్మెన్ కూసంపూడి మహేశ్, కమిషనర్ కోడూరు సుజాత, వైస్ ఛైర్మెన్ తోట సుజలారాణి, డీసీసీబీ డైరెక్టర్ చల్లగుండ్ల కృష్ణయ్య, కౌన్సిలర్లు మట్టా ప్రసాద్, చాంద్‌పాషా, అనిల్‌కుమార్ పాల్గొన్నారు.
కోర్టులో గాంధీ జయంతి వేడుకలు
ఖమ్మం లీగల్ : ఖమ్మం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గొల్లపూడి రామారావు ఆధ్వర్యంలో ఆదివారం బార్ అసోసియేషన్ హాల్లో మహాత్మా గాంధీ, లాల్ బహూదూర్ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బార్ కార్యవర్గం, సీనియర్ జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.
పొంగులేటి క్యాంపు కార్యాలయంలో మహాత్మ గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు
ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి : ప్రార్థన... అభ్యర్థన... నిరసన అనే ఆయుధాలతో ప్రపంచానికి సరికొత్త పోరాట మార్గాన్ని చూపిన మహానీయుడు మన జాతిపిత 'మహాత్మా గాంధీ' అని తెరాస రాష్ట్ర నాయకులు, ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం మహాత్మ గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతిని పురస్కరించుకుని ఖమ్మంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్లర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి పొంగులేటి మాట్లాడుతూ శాంతి... అహింసా మార్గంలోనే దేశానికి స్వాతంత్య్రం సాధ్యం అని నమ్మి అంటరానితనం, కుల,మత వివక్ష లేని సమసమాజ స్థాపనకు కషి చేసిన ఘనత మన గాంధీ కే దక్కుతుందన్నారు. ఆయన అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాల్సిన ఆవశ్యకత ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పినపాక మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ తెల్లం వెంకట్రావు, మద్దినేని బేబి స్వర్ణకుమారి, డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య, మధిర నియోజకవర్గ నాయకులు డాక్టర్ కోటా రాంబాబు, వైరా మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గుమ్మా రోశయ్య, కార్పోరేటర్ దొడ్డా నగేష్, నగర నాయకులు దుంపల రవికుమార్, మైనార్టీ నాయకులు షేక్ హిమామ్, చైతన్య పాల్గొన్నారు.