Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కలెక్టర్ గౌతమ్
నవతెలంగాణ-ఖమ్మం
బాపూజీ జాతిపిత మహాత్మాగాంధీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు పాటుపడాలని జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ పిలుపునిచ్చారు. మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకొని ఆదివారం జిల్లా జైల్ ఆవరణలో నిర్వహించిన ఖైదీల సంక్షేమ దినోత్సవానికి ముఖ్య అతిధిగా హాజరై మహాత్మాగాంధీ విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి మనిషి మంచి, చెడు ప్రవర్తన కలిగి ఉంటారని కాని మంచిని అవలంభించేవారు సమాజంలో గౌరవించబడుతారనే విషయాన్ని గమనించాలన్నారు. ఖైదీల్లో పరివర్తన రావాలని, నేర ప్రవృత్తిని వీడి సమాజంలో కలిసేలా మార్పు రావాలని అన్నారు. కుటుంబ సభ్యులందరిని వదిలి జైలు జీవితం గడపడం వల్ల కుటుంబ సభ్యులంతా వేరుగా ఉండటం వల్ల పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతుందున్నారు. సత్పప్రవర్తన కలిగిన ఖైదీలను శిక్షాకాలం సడలింపుకోసం ప్రభుత్వానికి వారిని సిఫారసు చేయడం జరుగుతుందని తెలిపారు. పది సంవత్సరాలు శిక్షననుభవించి శిక్షా కాలం పూర్తయి విడుదలయిన చింతకాని మండలానికి చెందిన వ్యక్తికి దళిత బంధు ద్వారా 10 లక్షల ఆర్థిక సాయం అందించడం జరిగిందని, ఇటువంటి అవకాశాలను సద్వినియోగపర్చుకొని తమ కుటుంబాన్ని ఆర్ధికంగా బలోపేతం చేసి సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకోవాలని తెలిపారు.
జిల్లా పోలీసు కమీషనర్ విష్ణు.యస్.వారియర్ మాట్లాడుతూ ఆవేశంలో చేసే చర్యల వల్ల నేరాలకు పాల్పడుతున్నారని, ప్రతి విషయంలో ఆలోచనతో ప్రశాంతతో ఉన్నప్పుడు ఎలాంటి అనర్థాలకు తావుండదని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ ఎండి అబ్దుల్ జావిద్ పాషా, జిల్లా జైలు సూపరింటెండెంట్ శ్రీధర్, జైలర్ సక్రూ నాయక్, తదితరులు పాల్గొన్నారు.