Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండి రమేష్
నవతెలంగాణ-ఖమ్మం
వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మూడో మహాసభలను జయప్రదం చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండి రమేష్ పిలుపునిచ్చారు. ఆదివారం ఖమ్మం రూరల్ మండలం లోని తమ్మినేని సుబ్బయ్య భవన్లో రూరల్ మండల కమిటీ సమావేశం తోట పెద్ద వెంకటరెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మూడవ రాష్ట్ర మహాసభలు ఖమ్మం నగరంలో జరుగుతున్నాయని, ఈ మహాసభలకు ముఖ్య అతిథిగా కేరళ ముఖ్యమంత్రి పినరరు విజయన్ హాజరవుతారని తెలిపారు. 2008 జూలై 28న ముదిగొండలో నాటి పాలకులు జరిపిన కాల్పుల్లో ఏడుగురు వ్యవసాయ కార్మికులు ప్రాణాల్ని కోల్పోయారన్నారు. ఆ పోరాట ఫలితమే ఇందిరమ్మ ఇండ్లు తదితర సంక్షేమ పథకాలు వచ్చాయన్నారు. దేశ సంపదను, ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటుకరిస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశానికి అన్నం పెట్టే వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ దోపిడీదారులకు కట్టబెట్టే చట్టాన్ని తెస్తున్నారన్నారు. దీనికి వ్యతిరేకంగా అన్ని రంగాల కార్మికులు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రూరల్ మండల కార్యదర్శి నండ్ర ప్రసాద్, పార్టీ జిల్లా నాయకులు మెరుగు సత్యనారాయణ, పార్టీ రూరల్ మండలం కార్యదర్శి వర్గ సభ్యులు పొన్నెకంటి సంగయ్య, నందిగామ కృష్ణ, పెండ్యాల సుమతి, పొన్నం వెంకటరమణ, మండల నాయకులు వై .ప్రసాదరావు, గురవయ్య, వి. నాగేశ్వరరావు, వై.నరసింహారావు, సిహెచ్ .బాబు తదితరులు పాల్గొన్నారు.