Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మం
ఖమ్మంలో బుర్హన్పురం జెండాల సెంటర్లో ఉన్న ఒక విద్యుత్ స్తంభం ఏ క్షణాన పడిపోతుందో తెలియని పరిస్థితిలో ఉన్నది. అటుగా ప్రతినిత్యం వందలాది మంది వాహనదారులు, పాదచారులు వెళుతుంటారు. ఒకవేళ జరగరానిది ఏదైనా జరిగితే భారీ నష్టం జరిగే అవకాశం ఉంది. ఇదే స్తంభాన్ని ఇటీవల ఒక వాహనం ఢ కొట్టింది. ఆ స్తంభానికి ఉన్న సీసీ కెమెరా సైతం పని చేయకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ ఆ స్తంభాన్ని ఇంతవరకు అధికారులు మరమ్మతులు చేయకపోవడంతో స్తంభం ఏ క్షణాన కింద పడుతుందోనని ఆ ప్రాంత ప్రజలు బిక్కబిక్కుమంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రమాదకరంగా మారిన విద్యుత్ స్తంభాన్ని మరమ్మత్తులు నిర్వహించాలని స్థానికులు కోరుతున్నారు.