Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రారంభించిన ఎస్ఐ యయాతి రాజ్...
- 500 మందిని పరీక్షించి మందులు పంపిణీ చేసిన వైద్యులు..
నవతెలంగాణ-కొణిజర్ల
మండల పరిధిలోని పెద్ద మునగాల గ్రామంలో శ్రీదేవి నవరాత్రుల సందర్భంగా ప్రాథమిక పాఠశాల నందు మండల టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గ్రామ సర్పంచ్ పరికపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో హెల్త్ క్యాంపు ఖమ్మం పట్టణ ప్రముఖ ప్రైవేటు వైద్య నిపుణులచే నిర్వహించారు. అనంతరం ప్రముఖ వైద్యుల పర్యవేక్షణలో గ్రామ ప్రజలకు ఉచితంగా సుమారు 500 మందిని పరీక్షించి మందులు అందజేశారు. ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ముఖ్య అతిథిగా హాజరైన ఎస్ఐ యాయాతి రాజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భవాని హాస్పిటల్ డా.రవికుమార్ గౌడ్, ప్రీత్ హాస్పిటల్, డా.గోపగాని సురేందర్, శ్రీ రక్షా డెంటల్, డా.పొట్లపల్లి కిషోర్ గౌడ్, ఆదిత్య హాస్పిటల్ డా, పి సోమయ్య సి స్టార్ సంకల్ప హాస్పిటల్ డా.రాకేష్, డాక్టర్ సీతారాం, ప్రవీణ్ హాస్పటల్, డాక్టర్ ప్రవీణ్, ఆర్ఎంపి వైద్యులు నరేష్ తాటికొండ వెంకటాచారి చారి, పుల్లారావు, తుప్పతీ ఆదినారాయణ, వైరా ఆత్మ ఛైర్మన్ కోసూరి శ్రీను, టీఆర్ఎస్ మండల నాయకులు రచ్చ రాంకోటయ్య, కొనకంచి మోషే, దొడ్డపనేని రామారావు, ఏలూరు శ్రీనివాసరావు, నరసింహరావు, రంజిత్, కొండలు, దుంపల కిషోర్, పాల్గొన్నారు.