Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పెనుబల్లి
బీజేపీ మతోన్మాద విధా నాలను ప్రతిగటించాలని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యుడు చలమాల విఠల్రావు అన్నారు. సూర్యనారాయణ భవనంలో సీపీఐ(ఎం) మండల కమిటీ సమావేశం నల్లమల్ల అరుణ్ ప్రతాప్ అధ్యకతన ఆదివారం పార్టీ మండల కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిది సంవత్సరాల గడిచిన మతోన్మాద విధానాలె అమలు చేస్తున్నారన్నారు. రాజ్యాంగం మూల స్తంభాలైన ప్రజాస్వామ్యం, న్యాయం, ఫెడరరిజం, లౌకిక తత్వం, వంటి వాటిని ధ్వంసం చేయటానికి వెనకాడడంలేదన్నారు. పోడు సాగు చేసుకుంటున్నా పేద గిరిజనులకు, దళితులకు న్యాయం జరిగే పద్ధతుల్లో భూ పంపిణీ జరగాలని ఆయన అన్నారు. ఈ సమావేశంలో సిపిఎం మండల కార్యదర్శి గాయం తిరుపతిరావు, మండల కమిటీ సభ్యులు కండె సత్యం, చలమాల నరసింహారావు, మిట్టపల్లి నాగమణి, గుడిమెట్ల బాబు, పి.రాజారావు, భుక్య ప్రసాద్ పాల్గొన్నారు.