Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మం కార్పొరేషన్
తెలంగాణలో మద్యం నియంత్రణ అమలు జరపాలని, బెల్టు షాపులు ఎత్తివేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ ఆదివారం ఖమ్మం గాంధీ చౌక్ లోని గాంధీ విగ్రహం ముందు ఆప్ హర్తాళ్ నిర్వహించారు. తొలుత ఆఫ్ ఖమ్మం జిల్లా కన్వీనర్ నల్లమోతు తిరుమల రావు, కార్యదర్శి స్వర్ణ సుబ్బారావు, పట్టణ కన్వీనర్ యుండి గఫూర్, మైనార్టీ నాయకులు హమీద్, ఉపేందర్, ఏ.సురేష్, చోటేమియ్యా, ఖలీం, జాఫర్, హనుమంతు, కలిసి గాంధీ విగ్రహానికి పూలమాలలు వేశారు. మద్యం తాగి మరణించిన వారి కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా చెల్లించాలని ఎత్తివేయాలని నినాదాలు చేశారు. హర్తాళ్ నుద్దేశించి ఆప్ ఖమ్మం జిల్లా కన్వినర్ నల్లమోతు తిరుమల రావు ప్రసంగిస్తూ గాంధీ, గాడ్సే రాజకీయాలు మధ్య విభజన రేఖను ప్రజలు గుర్తించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కన్వీనర్ యుండి గఫూర్, మైనార్టీ నాయకులు హమీద్, ఉపేందర్, ఏ.సురేష్, చోటేమియ్యా, ఖలీం, జాఫర్, హనుమంతు పాల్గొన్నారు.