Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు
నవతెలంగాణ-బోనకల్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం పనిచేస్తున్నాయని, ఈ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు నిర్వహించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు కోరారు. మండల కేంద్రంలోని వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరవీరుల భవనంలో సీపీఐ(ఎం) మండల కమిటీ సమావేశం బంధం శ్రీనివాసరావు అధ్యక్షతన ఆదివారం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం దేశాన్ని మతతత్వ ఆధారంగా విచ్ఛన్నం చేసేందుకు అనేక కుట్రలు పన్నుతుందని విమర్శించారు. కేంద్రంలో అధికారంలోకి బిజెపి రాకముందు అదాని అడ్రస్ లేదని కానీ బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆదాని ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ధనక వంతులలో రెండవ వాడుగా తయారయ్యాడని అన్నారు. దేశ సంపదను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అదాని కి కట్టబెడు తున్నాడని విమర్శించారు. దేశాన్ని అన్ని రకాలుగా బిజెపి ప్రభుత్వం దివాలా తీయించిందని విమర్శిం చారు. దేశాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన ఘనత బిజెపి ప్రభుత్వానిది అని అన్నారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు చింతలచెరువు కోటేశ్వరరావు, మండల కార్యదర్శి దొండపాటి నాగేశ్వరరావు, నాయకులు ఏడునూతల లక్ష్మణరావు, కందికొండ శ్రీనివాస రావు, దొప్ప కొరివి వీరభద్రం, గుగులోతు శారద, మందడపు శ్రీనివాసరావు, కొమ్మినేని నాగేశ్వరరావు, తెల్లాకుల శ్రీనివాసరావు, తుళ్లూరు రమేష్, చిట్టిమోదు నాగేశ్వరరావు, నోముల పుల్లయ్య, గుగులోతు నరేష్, పెద్దపోలు కోటేశ్వర రావు, గుడిపూడి వెంకటేశ్వర్లుపాల్గొన్నారు.