Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ-ఖమ్మం
ప్రజల కోసం సేవ చేయడమే సీపీఐ(ఎం) లక్ష్యమని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఆదివారం ఖమ్మం రూరల్ మండలంలో తమ్మినేని సుబ్బయ్య ట్రస్ట్ పేరుతో గత ఏడు సంవత్సరాలుగా నిర్వహిస్తున్న హెల్త్ క్యాంప్ ను తమ్మినేని సందర్శించారు. ఖమ్మం రూరల్ మండల కార్యదర్శి నండ్ర ప్రసాద్ అధ్యక్షతన సభ జరిగిన సభలో తమ్మినేని మాట్లాడుతూ బిపి, షుగర్‌తో బాధపడుతున్నవారు జిల్లాలో లక్షల సంఖ్యలో ఉన్నారని వారిని ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం చెందడం వల్లే సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లాలో నాలుగు కేంద్రాలు వైరా, ఖమ్మం రూరల్, ఖమ్మం టూ టౌన్, ఖమ్మం త్రీ టౌన్ లో బిపి, షుగర్ ఉన్న వారికి నెలకు సరిపడా మందులు కేవలం 100 రూపాయలకు అందిస్తూ వారిని ఆదుకుంటున్నామని తెలిపారు. ఈ వైద్య సేవలను ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని కోరారు. ఈ వైద్య సేవలో డాక్టర్లు, పార్టీ కార్యకర్తలు ఉచిత సేవ చేస్తున్నారని తెలిపారు. ఈ సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న డాక్టర్ బృందానికి పార్టీ కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ భారవి, డాక్టర్ పి.సుబ్బారావు, పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండి రమేష్, రూరల్ మండల కార్యదర్శి వర్గ సభ్యులు నందిగామ కృష్ణ, పొన్నం వెంకటరమణ, గోగుల నాగరాజు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన తమ్మినేని
ఖమ్మం రూరల్ మండలం ఏదులాపురం గ్రామంలో ఆదివారం అనారోగ్యంతో బాధపడుతున్న వారు కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకున్న వారికి ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి సిఫార్సుతో ముఖ్యమంత్రి మంజూరు చేసిన సీఎం రిలిఫ్ ఫండ్ చెక్కులను సీపీఐ(ఎం) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ ఈ ప్రాంతంలో సుదర్శన్ రెడ్డి కృషితో ఇప్పటివరకు ''కోటి 10 లక్షల 74 వేలు'' ఇప్పించామన్నారు. పేద ప్రజలకు ఏ కష్టం వచ్చినా సిపిఐ(ఎం) ముందు ఉంటుందని అని అన్నారు. అనంతరం సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు, రూరల్ మండలం కార్యదర్శి(ఇంఛార్జి) ఊరాడి సుదర్శన్ రెడ్డి కొన్ని రోజుల క్రితం రోడ్డు ప్రమాదానికి గురికాగా సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, పాలేరు పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ పరామర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మామిళ్ళ సంజీవరెడ్డి, శాఖ సెక్రటరీ దుండిగళ్ల నాగయ్య మండల కమిటీ సభ్యులు దుండిగల వెంకటేశ్వర్లు, డీవైఎఫ్ఐ నాయకులు గడ్డం వీరబాబు, పొన్నెకంటి అనీష్, రైతు సంఘం నాయకులు మమిళ్ళ విష్ణువర్ధన్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, టి.లింగయ్య, బ్రహ్మం, ఉపేందర్, నాగరాజు, ప్రముఖ న్యాయవాది నరసింహారావు, పొన్నెకంటి చక్రవర్తి, నవిలా లక్ష్మీనారాయణ, ఏపూరి కృష్ణ, ఉమాకర్, ప్రతాప్, చిరంజీవి, తమ్మనబోయిన యాదగిరి, పెండ్లి ఉపేందర్, మామిళ్ళ రవి, కొండ రవి, రెడ్డి ఉప్పలి , మల్లారెడ్డి , ముత్తగూడెం వైస్ సర్పంచ్ పొన్నం సంగయ్య, రేగళ్ల రామన్న, కాచిరాజు గూడెం సీపీఎం నాయకులు అద్దంకి నిర్మల్, నందిగామ నాగరాజు, ఇనగల రవి పాల్గొన్నారు.