Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పినపాక
పినపాక మండలం జానంపేట గ్రామ పంచాయతీలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సెయింట్ ఫాల్స్ లూథరన్ స్కూల్, కిమ్స్ హాస్పిటల్ భద్రాచలం ఆధ్వర్యంలో ఆదివారం వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ వైద్య శిబిరాన్ని ఆత్మ కమిటీ చైర్మన్ పోనుగోటి భద్రయ్య, స్థానిక సర్పంచ్ బాడిస మహేష్ ప్రారంభించారు. ఈ వైద్య శిబిరంలో ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ ఆలిన శాంతి మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. డాక్టర్ ఫరీద్ ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి ఈసీజీ, రక్త పరీక్షలు, షుగర్ పరీక్షలు నిర్వహించి మందలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ రవి శేఖర్ వర్మ, డాక్టర్ అలీనా శాంతి(గైనాకల్ జిస్ట్), డాక్టర్ ఫరీద్(జనరల్ ఫిజియషన్), ఫౌండేషన్ సభ్యులు, కె.అబ్రహాం, చర్చి ఫాదర్ ఆశ్వీరాదం, స్థానిక ప్రజాప్రతినిధులు ,తదితరులు పాల్గొన్నారు.