Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బూర్గంపాడు
మండలంలోని గోదావరి వరద బాధిత గ్రామాలను పోలవరం ముంపు గ్రామాలుగా గుర్తించి 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఆర్.ఆర్ పరిహారం అందించాలని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ జేఏసీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఆదివారం 45వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షలో జేఏసీ కన్వీనర్ కే.వి.రమణ, మేక పున్నం, గోనెల సడలు, రాయల వెంకటేశ్వర్లు, పాసికంటి వెంకటేశ్వర్లు, ఎస్కే గౌస్య బేగం, ఎస్కే రహి మున్నిసా బేగం, ఎస్కే వాజిద్, రాఘవులు, వెంకటేశ్వరరెడ్డి తదితరులు కూర్చోన్నారు.