Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్నారై నరసింహారెడ్డి
నవతెలంగాణ-బూర్గంపాడు
క్రీడలు మానసికొల్లాసానికి దోహదపడతాయని ఎన్నారై నరసింహారెడ్డి అన్నారు. మండల పరిధిలోని మోరంపల్లి బంజర గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ ఆదివారం ఆయన అంజనాపురం యువతతో క్రికెట్ ఆడారు. చిన్నప్పటి నుండి క్రికెట్‌పై మక్కువతో చదువుతూనే క్రికెట్ ఆడేవాడు. ఈ క్రమంలో ఉన్నత చదువులు చదువుకొని అమెరికా వెళ్లారు. ఇటీవల తన కుటుంబాన్ని కలిసేందుకు స్వగ్రామం వచ్చారు. ఈ నేపద్యంలో అంజనాపురం గ్రామ శివారులోని శీతల మైదానం క్రీడా మైదానంలో తన స్నేహితుడు తేజావత్ గాంధీతో కలిసి ఆదివారం అంజనాపురం యువ సైన్యంతో క్రికెట్ ఆడి తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. కాసేపు క్రీడా మైదానం మొత్తం కలియ తిరుగుతూ ఆనందం వ్యక్తం చేశారు. ఈ ఆనందానికి కారణమైన గాంధీని గట్టిగా ఆలింగనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో భూక్య రాంబాబు, భూక్య రామారావు, జాటోత్ ప్రవీణ్ కుమార్ శ్రీకాంత్ చిట్టి స్థానిక యువత పాల్గొన్నారు.