Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అశ్వారావుపేట
ఆయిల్ పామ్ సాగు దారుల ఐక్యతతోనే హక్కులు సంపాదించుకోవచ్చు అని తెలంగాణ ఆయిల్ ఫెడ్ అశ్వారావుపేట జోన్ ఆయిల్ పామ్ గ్రోవర్స్ సొసైటీ నాయకులు తుంబూరు ఉమామహేశ్వర రెడ్డి అన్నారు. ఈ సొసైటీ సభ్యత్వ నమోదు కార్యక్రమం కె.పుల్లయ్య అధ్యక్షతన ఆదివారం నారంవారిగూడెంలో ఓ ప్రైవేట్ నర్సరీలో నిర్వహించారు. సభ్యత్వ నమోదుకు వందలాదిగా పాల్గొని రైతుల సమైక్య సందేశాన్ని నినదించారు. మరింతో మంది రైతులకు స్ఫూర్తిగా నిలిచారు. ఈ సంధర్భంగా స్వయం పాలనా ఆకాంక్షను చాటారు. ఈ కార్యక్రమంలో రావు జోగేశ్వరరావు, హరిక్రిష్ణ, పిన్నమనేని మురళి, దారా తాతా రావు, దండు రామరాజు పాల్గొన్నారు.