Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జడ్జి ముఖేష్ జనమంచి
నవతెలంగాణ-ఇల్లందు
ఖైదీల ప్రవర్తనలో చక్కని మార్పు వచ్చి వారు జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని, అప్పుడే వారి కుటుంబంలో శుఖశాంతులు వెళ్లి విరుస్తాయని జడ్జీ ముఖేష్ జనమంచి అన్నారు. గాంధీజీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం ఇల్లందు సబ్ జైల్లో జరిగిన ఖైదీల సంక్షేమ దినోత్సవంలో పాల్గొని మాట్లాడారు. మంచి పౌరులుగా మారినప్పుడే గాంధీజీ కలలు కన్న శాంతి సౌభాగ్యాలు ప్రజలందరికీ అందుతాయని అన్నారు. అనంతరం ఖైదీలకు స్వీట్స్ మరియు పండ్లను పంపిణీ చేసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జైల్ సూపరింటెండెంట్ మల్లెల శ్రీనివాస్ మాట్లాడుతూ, జనసమూహంలో ఉన్నప్పుడు ఖైదీ ప్రవర్తనతో మాకు సంబంధం లేదని, జైల్లోకి వచ్చిన తర్వాత అతనిలో మార్పు తీసుకురావడవం, అతని సంక్షేమమే మాకు ముఖ్యమని చెప్పెను. ఈ కార్యక్రమంలో ఇల్లందు న్యాయవాదుల సంఘం జనరల్ సెక్రటరీ, బి.రవికుమార్ నాయక్, సీనియర్ న్యాయవాది బాలకృష్ణ, హెడ్ వార్డర్ బుజంగరాజు, జైలు సిబ్బంది పాల్గొన్నారు.