Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 40 అడుగుల ఎత్తు బతుకమ్మలతో ఊరేగింపు
- పూలను దైవంగా భావించే పండుగ బతుకమ్మ
- సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య
నవతెలంగాణ- సత్తుపల్లి
సత్తుపల్లిలో సోమవారం రాత్రి నిర్వహించిన బతుకమ్మల భారీ ఊరేగింపు కన్నుల పండువలా జరిగింది. 40 అడుగుల ఎత్తుతో ఏర్పాటు చేసిన భారీ బతుకమ్మలతో పాటు మండలంలోని వివిధ గ్రామాల నుంచి తీసుకొచ్చిన వందలాది బతుకమ్మల జరిగిన ఊరేగింపుతో ప్రధాన రహదారి సందడిగా మారింది. విచిత్ర వేషధారణలు, మహాశక్తుల అవతారాలతో నృత్యం అబ్బుర పరిచింది. తెలంగాణ గీతాలు డీజే సౌండ్‌తో పట్టణం అదిరిపోయింది. కోలాట నృత్యాలు అలరించాయి. మున్సిపల్ ఛైర్మెన్ కూసంపూడి మహేశ్ మాధవి, కౌన్సిలర్ వీరపనేని బాబీ రాధికల ఆధ్వర్యంలో ఈ భారీ బతుకమ్మలను సిద్ధం చేశారు. స్థానిక అంబేడ్కర్ సర్కిల్ నుంచి బతుకమ్మల ఊరేగింపు ప్రారంభమై సుమారు 3గంటల పాటు పట్టణ ప్రజలను అలరించిన అనంతరం పట్టణంలోని గుడిపాడు సమీపంలోని తామరచెరువు వద్ద ఏర్పాటు చేసిన ఘాట్ల వద్ద బతుకమ్మలను నిమజ్జనం చేశారు.