Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సత్తుపల్లి
స్థానిక కిష్టారం ఓసీలో యాజమాన్యం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దేవి శరన్నవరాత్రుల ఉత్సవాలకు సోమవారం కొత్తగూడెం ఏరియా జీఎం జక్కం రమేశ్ దంపతులు హాజరై శ్రీదుర్గాభవానీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జక్కం రమేశ్ మాట్లాడుతూ మైన్‌లో కార్మికులను అమ్మవారు ఎల్లప్పుడూ రక్షించాలని కోరుకున్నట్లు తెలిపారు. కార్మికుల సంక్షేమం కోసం ఉత్సవాలు నిర్వహించడం పట్ల స్థానిక సిబ్బందిని అభినందించారు. అనంతరర ఆలయ కమిటీ బాధ్యులు రమేశ్ దంపతులను శాలువాతో సత్కరించి, నూతన వస్త్రాలు బహుకరించారు. కార్యక్రమంలో జేవీఆర్ ఓసీ పీవో ఎస్.వెంకటాచారి, కిష్టారం ఓసీ పీవో నరసింహారావు, జేవీఆర్ ఓసీ పీఈ లక్షణమూర్తి, సివిల్ ఏజీఎం టీ.సూర్యనారాయణ, ఏరియా ఇంజినీర్ రఘురామరెడ్డి, కిష్టారం ఓసీ మేనేజర్ ముక్కపాటి వెంకటేశ్వరరావు, జేవీఆర్ ఓసీ మేనేజర్ పి.నరసింహారావు, పిట్ సెక్రెటరీ జేఎస్ఆర్ మూర్తి, ఎస్వో జి.దుర్గాప్రసాద్, అండర్ మేనేజర్ రమేశ్‌బాబు, ఎస్ఎస్వో మధుసూదనరావు, సీనియర్ పర్సనల్ ఆఫీసర్ కాలవ దేవదాసు పాల్గొన్నారు.