Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 94 మందికి రూ.36.55 లక్షల విలువ గల చెక్కులు అందజేత
నవతెలంగాణ-ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ప్రతి కుటుంబానికి పెద్ద కొడుకు లాంటి వ్యక్తి తెలంగాణ సీఎం కేసీఆర్ అని డీసీసీబీ చైర్మన్ కురాకుల నాగభూషణం అభిప్రాయపడ్డారు. తెలంగాణాలో ఏ కుటుంబానికి కష్టం వచ్చినా కుటుంబ సభ్యునిలాగా నేనున్నాని భరోసా ఇస్తూ.. ఎల్లప్పుడూ కెసిఆర్ అండగా ఉంటున్నారని గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పాటు లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు శ్రమిస్తున్న కెసిఆర్ కు అన్ని వేళలా ప్రజలు అండగా ఉండాలన్నారు. ఖమ్మం నగరం జూబ్లిపురలోని ఎంపీ నామ క్యాంప్ కార్యాలయంలో సోమవారం మధిర నియోజకవర్గంలోని బోనకల్, చింతకాని, మధిర, ముదిగొండ, ఎర్రుపాలెంతో పాటుగా ఖమ్మం రూరల్, డోర్నకల్, ఖమ్మం కార్పొరేషన్, కొత్తగూడెంకు చెందిన 94 మంది లబ్ధిదారులకు రూ .36.55 లక్షల చెక్కులను అందజేశారు . రైతు బంధు సమన్వయ సమితి జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వర్లు సభా కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా కూరాకుల నాగభూషణం, రోటరీ క్లబ్ ఛైర్మన్, శ్రేష్ఠ హాస్పిటల్ ఎండీ కిలారి సునీల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కూరాకుల నాగభూషణం మాట్లాడుతూ ఎంపీ నామ నాగేశ్వరరావు ప్రత్యేక చొరవ తీసుకుని లబ్ధిదారులకు ఎక్కువ మొత్తంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందేలా కృషి చేస్తున్నారన్నారని తెలిపారు. రైతు బంధు సమన్వయ సమితి జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఎంపీ నామ ప్రాతినిధ్యం వహిస్తున్న ఏడు నియోజకవర్గాల్లోని పేద, మధ్యతరగతికి చెందిన లబ్ధిదారులకు నిరంతరాయంగా ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమం కొనసాగడం అభినందనీయమన్నారు.
ఈ కార్యక్రమంలో వైరా జడ్పీటీసీ డాక్టర్ నంబూరి కనకదుర్గ, ముదిగొండ ఎంపీపీ సామినేని హరిప్రసాద్, చింతకాని ఎంపీపీ కొప్పూరి పూర్ణయ్య, వైస్ ఎంపీపీ గురిజాల హనుమంతరావు, ఎర్రుపాలెం, బోనకల్, చింతకాని, ముదిగొండ మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చేబ్రోలు మల్లికార్జునరావు, పెంట్యాల పుల్లయ్య, వాచేపల్లి లక్ష్మారెడ్డి, మండల పార్టీ నాయకులు పాల్గొన్నారు.