Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే సండ్రకు డివిఎస్ఎస్ విజ్ఞప్తి
నవతెలంగాణ-కల్లూరు
మండలంలో ఎన్నో ఏళ్లుగా పాత్రికేయ వృత్తిలో కొనసాగుతూ ఆర్థికంగా వెనుకబడిన దళిత విలేకరులందరికీ దళిత బంధు పథకాన్ని వర్తింపజేయాలని కోరుతూ కల్లూరు మండల దళిత విలేకరుల సంక్షేమ సంఘం సోమవారం సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర.వెంకట వీరయ్యకు వినత పత్రం అందజేశారు. కల్లూరు పట్టణంలో దళిత విలేకరుల సంక్షేమ సంఘం కమిటీ సభ్యులు సమావేశమై కల్లూరు మండలంలో అతి త్వరలోనే ప్రభుత్వం మంజూరు చేయనున్న దళిత బంధు లబ్ధిదారుల జాబితాలో మండలంలో పనిచేస్తున్న 19 మంది దళిత విలేకరులను లబ్ధిదారులు చేర్చి వారందరికీ దళిత బంధు పథకం అమలు చేయాలని తీర్మానించారు. ఈ సందర్భంగా దళిత విలేకరుల సంక్షేమ సంఘం అధ్యక్ష కార్యదర్శులు యంగల సురేష్, ఉబ్బన చంటి మాట్లాడుతూ మండలంలో పనిచేసే దళిత విలేకరులకు దళిత బంధు పథకాన్ని కూడా అమలు చేసి మరోసారి తన మానవత్వాన్ని చాటుకోవాలని సభ్యులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు వారణాసి బాలరాజు, వేము రాంబాబు, ఖమ్మం పాటి మల్లేశ్వరరావు, కోట. పుల్లయ్య, జానపాటి. రోజు వేణు, ఆదూరి. ప్రభాకర్, నల్లగట్ల. గురవయ్య, పరిగడుపు. బాబురావు, సింగి సాల. కోటిరత్నం, దామాల. సురేష్, తదితరులు పాల్గొన్నారు.