Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమన్వయంతో జాతర భక్తులకు సౌకర్యాలు
- వైరా ఎమ్మెల్యే రాములునాయక్
నవతెలంగాణ-కారేపల్లి
వైరా నియోజవర్గ ప్రజలకు ఎమ్మెల్యేగా సేవ చేసే అవకాశం మరోసారి ఇవ్వమని, కేసీఆర్‌ను మూడోసారి ముఖ్యమంత్రి గా అఖండ మెజార్టీ ఇవ్వమని కోటమైసమ్మ అమ్మను వేడుకున్నట్లు వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ తెలిపారు. దసరా సందర్బంగా మండలంలోని ఉసిరికాయలపల్లిలోని శ్రీకోటమైసమ్మ తల్లి ఆలయం ప్రాంగణంలో జరిగే జాతర ఏర్పాట్లపై సోమవారం ఉసిరికాయలపల్లిలో ప్రభుత్వ శాఖల అధికారులతో సమావేశంను దేవదాయశాఖ ఈవో కొండకింద వేణుగోపాలాచార్యులు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈనెల 5వ తేది నుండి ఐదు రోజుల పాటు నిరంతరాయంగా జరిగే కోటమైసమ్మ తల్లి జాతర కు లక్షలాధి మంది భక్తులు వస్తారని వారికి ఆసౌకర్యం కల్గకుండా చూడాల్సిన బాధ్యత అన్ని ప్రభుత్వ శాఖలపైన ఉందన్నారు. విద్యుత్, త్రాగునీరు, వైద్యం, పారిశుద్యం, శాంతి భద్రతలపై దృష్టిపెట్టాలని అధికారులను కోరారు. సమన్వయంతోనే జాతరను విజయవంతం అవుతుందన్నారు. అంతకు ముందు అలయానికి వచ్చిన ఎమ్మెల్యేకు ఆలయ ధర్మకర్త డాక్టర్ పర్సా పట్టాభిరామారావు, ఈవో వేణుగోపాలచార్యులు. ప్రధాన అర్చకులు కొత్తలంక కైలాసశర్మలు పుర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు ఎమ్మెల్యేను శాలువతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ వాంకుడోత్ జగన్, మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ ముత్యాల సత్యనారాయణ, టీఆర్ఎస్ మండల అధ్యక్షప్రధానకార్యదర్శులు తోటకూరి రాంబాబు, అజ్మీర వీరన్న, వైస్‌ఎంపీపీ రావూరి శ్రీనివాసరావు, సోసైటీ అధ్యక్షులు దుగ్గినేని శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు దారావత్ మంగీలాల్, రైతు బంధు మండల కన్వీనర్ గుగులోత్ శ్రీను, సంత ఆలయ చైర్మన్ మల్లెల నాగేశ్వరరావు, దిశ కమిటీ సభ్యులు బానోత్ కుమార్, సర్పంచ్ బానోత్ బన్సీలాల్, ఎంపీటీసీ మూడు జ్యోతి మోహన్, పెద్దబోయిన ఉమాశంకర్, దారావత్ పాండ్యానాయక్, బానోత్ రమేష్, సర్పంచ్‌లు మొగిలి ఆదినారాయణ, ఆదెర్ల స్రవంతి, ఇస్లానత్ సుజాతబన్సీలాల్, బానోత్ మారుసక్రు, సీఐ అరీఫ్ అలీఖాన్, కారేపల్లి, కామేపల్లి ఎస్సైలు పోలోజు కుశకుమార్, కిరణ్‌కుమార్, ఎంపీడీవో చంద్రశేఖర్, ఎంపీవో రాజారావు, వైద్యాధికారి డాక్టర్ యాస హన్మంతరావు పాల్గొన్నారు.