Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దళితబంధు కోర్ కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్
నవతెలంగాణ - ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
దళితబంధు యూనిట్లను త్వరితగతిన గ్రౌండింగ్ చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ ఆదేశించారు. జిల్లా ప్రజాపరిషత్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన దళితబంధు కోర్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. మంజూరు అయిన యూనిట్లకు వంద శాతం నగదు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. లబ్ధిదారులు ఎంపిక చేసిన యూనిట్ల సేకరణకు చర్యలు వేగవంతం చేయాలన్నారు. ఈ నెల 10వ తేదీ లోగా కనీసం 70 కారు యూనిట్లు గ్రౌండింగ్ అయ్యేలా చూడాలన్నారు. గొర్రెల యూనిట్ల స్థాపనకు చర్యలు వేగవంతం చేయాలన్నారు. పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపికయిన చింతకాని మండలంలో 3421 మంది లబ్ధిదారుల్లో ఇప్పటి వరకు 1606 యూనిట్లు గ్రౌండింగ్ చేసినట్లు తెలిపారు. 710 యూనిట్లు నెలకొల్పేందుకు ప్రక్రియ చేపట్టామన్నారు. ఈ వారంలో సేకరణ ప్రక్రియ పూర్తి చేసిన యూనిట్ల గ్రౌండింగ్ లక్ష్యంగా కార్యాచరణ పూర్తి చేయాలన్నారు. యూనిట్ల గ్రౌండింగ్ ను ఎప్పటికప్పుడు ఆన్లైన్ అప్డేట్ చేయాలన్నారు. గ్రౌండింగ్ అయిన యూనిట్ల నిర్వహణ విషయమై అధికారులు పర్యవేక్షణ చేయాలని సూచించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ స్నేహలత మొగిలి, ఖమ్మం ఆర్డీవో రవీంద్రనాథ్, జెడ్పీ సీఈవో అప్పారావు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఏలూరి శ్రీనివాసరావు, జిల్లా రవాణాధికారి కిషన్ రావు, జిల్లా వ్యవసాయ అధికారిణి విజయ నిర్మల, జిల్లా ఉపాధికల్పనాధికారి శ్రీరామ్, జిల్లా పశుసంవర్ధక అధికారి డా. వేణు మనోహర్, పంచాయతీ రాజ్ ఈఈ శ్రీనివాసరావు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.