Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అదనపు కలెక్టర్ స్నేహలత
నవతెలంగాణ-వేంసూరు
బతుకమ్మ పండుగ సందర్భంగా సోమవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ సంబరాలలో అదనపు కలెక్టర్ స్నేహలత, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యలు పాల్గొన్నారు. మండల పరిషత్ కార్యాలయం నుండి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వరకు బతుకమ్మలతో ర్యాలీ నిర్వహించి అనంతరం పాఠశాలలో ఏర్పాటుచేసిన సభలో వారు మాట్లాడుతూ తెలంగాణలో బతుకమ్మ పండుగకు ఎంతో విశిష్టత ఉన్నదని ఆ పండుగలను గౌరవిస్తూ తెలంగాణ ప్రభుత్వం అధికారకంగా నిర్వహించుకోవడం గొప్పతనమని అన్నారు. సభలో రెండు కోట్ల బ్యాంకు లింకేజ్ నగదును డ్వాక్రా సంఘాలకు ఎమ్మెల్యే, అసిస్టెంట్ కలెక్టర్ చేతుల మీదుగా గ్రూపులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ. పగుట్ల వెంకటేశ్వరరావు, జడ్పిటిసి సుమలత, స్థానిక సర్పంచ్లు ఎండి ఫైజుద్దీన్, వేణుగోపాల్ రెడ్డి, ఎంపీటీసీ నాయుడు వెంకటేశ్వరావు, వైస్ ఎంపీపీ దొడ్డ శ్రీలక్ష్మి, ఈఓఆర్డి రంజిత్, రహీం ఏటీఎం శ్రీనివాసరావుతో పాటు వివిధ శాఖల అధికారులు ప్రజాప్రతినిధులు టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.