Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రపంచ కార్మిక సంఘాల సమాఖ్య
(డబ్ల్యూఎఫ్టీయూ) ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిరసన
నవతెలంగాణ-కొత్తగూడెం
ప్రపంచ వ్యాప్తంగా కార్మిక సమస్యలపైన పని చేస్తున్న డబ్ల్యూఎఫ్టీయూ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అధిక ధరలు తగ్గించాలని కేంద్ర బీజేపీ ప్రభుత్యం చర్యలను నిరసిస్తూ సిఐటియు, ఎఐటియుసి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రామాటాకీస్ రోడ్లో ప్లకార్డులు చేతబట్టి తమ నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సిఐటియు పట్టణ కన్వీనర్ డి.వీరన్న అధ్యక్షతన జరిగిన సభలో సిఐటియు జిల్లా కార్యదర్శి ఏజె.రమేష్, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి గుత్తుల సత్యనారాయణలు మాట్లాడుతూ డబ్ల్యూఎఫ్టీయూ వేతనాలు, పెన్షన్ పెంపు, ఉద్యోగ భద్రత, ఆరోగ్య, సంరక్షణ సరళీకృత ఆర్థిక విధానాల దుష్పభావాలువంటి ముఖ్యమైన సమస్యలపై ఏ దేశంలో సమ్మెలు, ఉద్యమాలు జరిగిన డబ్ల్యూఎఫ్టియు తన సంఘీభావాన్ని తెలియజేస్తుంద న్నారు. డబ్ల్యూఎఫ్టియు ఆవిర్భావ దినోత్సవం అయిన నేడు ''అంతర్జాతీయ యాక్షన్ డే''గా ప్రకటించారని దీనికి అనుగుణంగా మన రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు సమస్య పై నిరసన కార్యక్రమాలకు పిలుపు నిచ్చారన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం తీసుకుంటున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాల వల్ల నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అందుకున్నాయని, ధరలు తగ్గింపు పై కేంద్ర ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని విమర్శించారు. కార్పొరేట్ శక్తులకు రాయితీలు ఇచ్చే ఆసక్తి ఉన్న ప్రభుత్వానికి, సామాన్యుడి ధరల భారాన్ని తగ్గించే చర్యలుకి పూనుకోకపోవడం ఈ ప్రభుత్వ విధానాన్ని సూచిస్తుంది అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు భూక్య రమేష్, విజయగిరి శ్రీనివాస్, వై.వెంకటేశ్వర్లు, నాగేశ్వరరావు, వినోద్, చారి, ఏఐటీయూసీ జిల్లా నాయకులు వంగా వెంకట్, లక్ష్మి నారాయణ, మాచర్ల శ్రీను, సత్యనారాయణ చారి, విజయ్ పాల్గొన్నారు.