Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దమ్మపేట
గిరిజనులకు అధికార పార్టీ నాయకులు అన్యాయం చేస్తున్నారని బాధితురాలు మస్తాన్‌బీ భర్త కోర్స నాగేంద్రరావు ఆరోపించారు. ఈ విషమై సోమవారం మాట్లాడారు. దమ్మపేట గ్రామపంచాయతీ పరిధిలో గల మల్లారం కాలనీ ఎస్సీ, బీసీ హాస్టల్ ఎదురుగా ఉన్న ల్యాండ్‌లో సీపీఐ పార్టీ వారి సహకారంతో రేకుల షెడ్డును గత ఎనిమిదేండ్ల కిందట ఇచ్చిన స్థలంలో ఇల్లు నిర్మించుకొని జీవనం సాగిస్తున్నామని తెలిపారు. మా అమ్మకి ఆరోగ్యం బాగోక చూసేందుకు వెళ్లి వచ్చిన అనంతరం గిరిజన యువకుడు కొరసా నాగేందర్ ఒక ముస్లిం అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకొని కొందరు నేతలు గిరిజనుడు అయినటువంటి కోర్స నాగేందర్ ఇంటి స్థలాన్ని ఆక్రమించి ఏజెన్సీ ఏరియాలో ఉన్న 1/70 యాక్ట్ చట్టాన్ని తుంగలో తొక్కుతూ కొందరు టీఆర్ఎస్ నేతలు అర్హులైనటువంటి వారిని కాకుండా అనర్హులను వెనకేసుకొస్తున్నారు. ఇట్టి విషయంపై పోలీసు వారిని సంప్రదించగా పోలీస్ వారు ఆక్రమదారులైన అధికార టీఆర్ఎస్ పార్టీ నాయకులకు కొమ్ముకాస్తున్నారని బాధితురాలు మస్తాన్ బి వాపోయింది. ఇట్టి విషయంపై గిరిజన సంఘ నాయకులు వైయస్సార్ టీపీ జిల్లా అధ్యక్షుడు సోయం వీరభద్రం స్పందిస్తూ అధికార టీఆర్ఎస్ పార్టీ నేతలు కొందరు ఇట్టి విషయంపై గిరిజన కుటుంబం గిరిజనులు అయినటువంటి ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరావు దగ్గరికి వెళ్లి వారి బాధను తెలిపారు. ఎమ్మెల్యే గిరిజనుడు బాధను పక్కనపెట్టి అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే తొత్తులుగా ఉన్న వారికి గులాం గురి చేస్తూ సలాం కొడుతున్నారు అన్నారు. మరో గిరిజన సంఘ నేత వాడే వీరస్వామి మాట్లాడుతూ అధికార టీఆర్ఎస్ పార్టీ నేతలకు వారు చేసే పనులకు అడ్డు అదుపు లేకుండా పోతుందన్నారు. మస్తాన్ బికి ఇల్లును అప్పచెప్పే వరకు గిరిజన జేఏసీ సంఘ తరఫున న్యాయపోరాటం చేస్తామని న్యాయం జరగకపోతే హెచ్ఆర్సీ అయినటువంటి మానవ హక్కుల సంఘాన్ని కూడా సంప్రదిస్తామని తెలిపారు.