Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వంశీకృష్ణ
దుమ్ముగూడెం : లఖింపూర ఘటన జరిగి ఏడాది కావస్తున్న నేటికీ కేంద్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఘటనకు బాధ్యుడిని చేస్తూ కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాను మంత్రి పదవి నుంచి తొలగించాలని, దోషులను కఠినంగా శిక్షించాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షులు యలమంచి వంశీ కృష్ణ, తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కారం పుల్లయ్యలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం మండలంలోని భీమవరం గ్రామంలో తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...ఆనాడు కేంద్ర ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా తీసుకొచ్చినటువంటి మూడు నల్ల చట్టాలను తక్షణమే రద్దు చేయాలని చేసిన పోరాటంలో భాగంగా ఈ ఘటన జరిగిందని బీజేపీ అధికారంలో వచ్చినప్పటినుండి ఇలాంటి అనేక సంఘటనలు జరుగుతూనే ఉన్నాయని వారు అన్నారు. సంయుక్త కిసాన్ మోర్చా పిలుపులో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో వ్యకాస మండల కార్యదర్శి మర్మం చంద్రయ్య, మహిళా సంఘం మండల కమిటీ సభ్యురాలు సోయం నాగమణి, ఆదివాసి గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు సోయం జోగారావు, టీఏజీఎస్ మండల కార్యదర్శి సర్పంచ్ తోడం తిరుపతిరావు, చిట్టిబాబు, వెంకటరమణ, కన్నయ్య పాల్గొన్నారు.