Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐద్వా జిల్లా అధ్యక్షురాలు సరియం రాజమ్మ
నవతెలంగాణ-దుమ్ముగూడెం
రైతులు వ్యవసాయ పెట్టుబడి కోసం బ్యాంకు నుండి తీసుకున్న రుణాలను మాఫీ చేసిన విధంగానే డ్వాక్రా మహిళలు బ్యాంకుల నుండి తీసుకున్న రుణాలను మాఫీ చేయాలని ఐద్వా జిల్లా అధ్యక్షురాలు సరియం రాజమ్మ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం చిన్న నల్లబెల్లి గ్రామంలో సర్పంచ్ మీడియం జయ అధ్యక్షతన జరిగిన మండల మహిళా సంఘం జనరల్ బాడీ సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడుతూ...రైతులకు ఎలా రుణమాఫీ చేస్తున్నారో అదేవిధంగా డ్వాక్రా మహిళలకు కూడా రుణమాఫీ చేయాలన్నారు. పేదలందరికీ డబల్ బెడ్ రూమ్లు ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. అదేవిధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు అరికట్టే విధంగా చట్టాలు తీసుకోవాలన్నారు. ఐద్వా మండల కమిటీ సభ్యులు కాశీనాగారం సర్పంచ్ పూనెం కనకదుర్గ, ఇనుగుర్తి రాజేశ్వరి, సుజాత, సారమ్మ తదితరులు పాల్గొన్నారు.