Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైల్వే భూనిర్వాసితులకు చెక్కుల పంపిణీలో రేగా
నవతెలంగాణ-మణుగూరు
మండలంలోని సమితి సింగారం రెవెన్యూ పరిధిలోని రైల్వే లైన్ భూ నిర్వాసితులకు ప్రభుత్వ విప్ పినపాక శాసన సభ్యులు రేగా కాంతారావు చెక్కులు అందజేశారు. సోమవారం మండలంలోని తహసీల్దార్ కార్యాలయం నందు మండలం సమితి సింగారం రెవెన్యూ పరిధిలోని భద్రాద్రి ధర్మల్ పవర్ ప్లాంట్ స్టేషన్కు బొగ్గు రవాణా చేసేదెందుకు ఏర్పాటు చేస్తున్న రైల్వే లైన్ నిర్మాణం భూ నిర్వాసితులకు ప్రభుత్వ నుంచి మంజూరైన రూ.కోటి విలువ గల చెక్కులను 33 మంది రైతులకు అందజేశారు, అదేవిధంగా 22 మంది రైతులకు స్వయం ఉపాధి కోసం అదనంగా సీఎం కేసీఆర్తోని మాట్లాడి స్వయ ఉపాధి కోసం రూ.22 లక్షలు విలువగల చెక్కులను అందజేశారు. రానున్న రోజులలో అన్ని విధాలుగా ఆదుకుంటామని ఎవరు కూడా ఆందోళన చెందవద్దని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు, తహసీల్దార్ నాగరాజు, టీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.