Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గిరిజన రైతులకు పోడు పట్టాలు అందజేయాలి
- వ్యకాస జిల్లా ఉపాధ్యక్షులు బత్తుల
నవతెలంగాణ-బూర్గంపాడు
పోడు భూములపై సమగ్ర సర్వే చేపట్టాలని, గిరిజన రైతులకు పట్టాలు అందజేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బత్తుల వెంకటేశ్వర్లు అన్నారు. బూర్గంపాడు మండలం పరిధిలో బుడ్డగూడెం గ్రామంలో సోమవారం పోడు భూములపై జనరల్ బాడీ సమాచారం నిర్వహించారు. ఈ సమావేశానికి మిడియం పుల్లయ్య అధ్యక్షతన వహించారు. ఈ సందర్భంగా బత్తుల మాట్లాడుతూ పోడు భూములను 1996 సంవత్సరాల నుండి సాగు చేస్తున్న గిరి జనుల నుండి భూములను బలవంతంగా ప్రభుత్వం, ప్రభుత్వ అధికారులు లాక్కున్నారని ఆయన అన్నారు. గతంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతి గిరిజనుల దగ్గరుండి దరఖాస్తులు తీసుకున్నారని, 2000 దర ఖాస్తులు అధికారులకు గిరిజనులు ఇచ్చారని ఆయన అన్నారు. 10000 ఎకరాల భూమి గిరిజనుల దగ్గర ఉందని వెంటనే దరఖాస్తు చేసుకున్న వారికి అటవీ హక్కుల చట్టం 2006 ప్రకారం పోడు భూములకు పట్టాలు అందజేయాలని ఆయన అన్నారు. సీపీఐ(ఎం) ఆనాడు కేంద్రం ప్రభుత్వానికి మద్దతు ఇవ్వటం వల్ల అటవీ హక్కుల చట్టం వచ్చిందని ఈ సందర్భంగా ఆయన అన్నారు. సెప్టెంబర్ 3న రాష్ట్ర బృందం ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలంగాణ ప్రభుత్వానికి మెమోండరం అందజేశారని ఆయన పేర్కొన్నారు. పోడు భూములకు తక్షణమే పోడుపట్టాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అందువల్ల ఇప్పుడు జరుగుతున్న సర్వే గిరిజనులకు అందరికీ అటవి హక్కుల చట్టం హక్కు పత్రాలు అందించాలని ఆయన కోరారు. వ్యకాస జిల్లా కమిటీ సభ్యులు నిమ్మల అప్పారావు, శ్రీను, వెంకటేశ్వర్లు, కుర్స తిరుప తిరావు, బొర్రా కృష్ణ, సోడే రాజు, కృష్ణ, కనితి అర్జున్, వీరభద్రం పాల్గొన్నారు.