Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చర్ల
మండలం పరిధిలో గల అత్యంత కీకారణ్యం రామ చంద్రపురం గ్రామంలో నిరుపేద ఆదివాసీలకు వికాస తరంగిణి చర్ల మండల శాఖ ఆధ్వర్యంలో సోమవారం భారీ వితరణ నిర్వహించారు. మండల కేంద్రానికి సుదూర అటవీ గ్రామమైన ఆర్సీపురంలో వరదల సమయంలో చుట్టూ వాగులు పొంగడంతో చిక్కుకున్న ఆ గ్రామ ఆదివాసీలు పడిన కష్టాలను తెలుసుకున్న వికాస తరంగిణి బాధ్యులు గుంజి పురుషోత్తం, మల్లిఖార్జున్, మనికరావు, అశోక్ గంటుపల్లి నరసింహాచారి ఏఐటీయూసీ నాయకుడు గుంజి మాల్యాద్రి నేతృత్వంలో వికాస తరంగిణి బాధ్యులు కుర్నపల్లి నుంచి వాగు దాటుకుంటూ వెళ్లి దాదాపు రూ.25 వేల విలువైన నిత్యావసర వస్తువులు కూరగాయలు, బియ్యం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గణేష్ నగర్ యువ జన కమిటీ సభ్యులు గోసంగి సాంబ, పండు, పొలురి రాము, రామగిరి అరుణ్, నర్సింహ మూర్తి, అంజి గొత్తికోయ యువజన సంఘం నాయకులు చందు, ఉంగయ్య తదితరులు పాల్గొన్నారు.