Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడెం
కొత్తగూడెం ఏరియాలోని సత్తుపల్లి జేవిఆర్, కిష్టారం ఓసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంద నరసరావు కోరారు. సోమవారం కొత్తగూడెం ఏరియా చీఫ్ జనరల్ మేనేజర్ జక్కం రమేష్‌కి, డిజిఎం పర్సనల్ సామేల్ సుధాకర్‌కి సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో వినతి పత్రం అందదజేశారు. కొత్తగూడెం ఏరియా బ్రాంచి కార్యదర్శి విజయగిరి శ్రీనివాస్ అధ్యక్షత జరిగిన కార్యక్రమంలో వారు మాట్లాడారు. గత కొంతకాలం నుండి కార్మికులు సత్తుపల్లి సింగరేణి కాలనీలో జేవిఆర్, కిష్టారం ఓసీలో అనేక ఇబ్బందులకు గురవుతున్నారని వాటిని పరిష్కరించాలన్నారు. సత్తుపల్లి సింగరేణి కాలనీలో కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేయాలని, చిన్న పిల్లల పార్కు నిర్మించాలని, కాలనీలో డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని, డ్రింకింగ్ వాటర్ సరిగా రావడం లేదని, ఆర్వోఆర్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని, సింగరేణి ఏరియా హాస్పిటల్లో గైనకాలజిస్ట్ డాక్టర్ లేరని ఇందువల్ల కార్మికులు మహిళలు కొత్తగూడెం ప్రధాన హాస్పిటల్‌కు వెళ్లాల్సి వస్తుందని తక్షణమే గైనకాలజిస్ట్ డాక్టర్‌ను నియమించాలని డిమాండ్ చేశారు. డిస్పెన్సరిలో మంచినీటి సౌకర్యం కూడా లేదని వెంటనే ఏర్పాటు చేయాలన్నారు. పెండింగ్‌లో ఉన్న రోడ్లు పూర్తి చేయాలని, కిష్టారం ఓసీలో పర్మెంటు, డీఎల్ఆర్ కార్మికులు సుమారు 300 మంది పనిచేస్తున్నారని వారికి కేవలం రెండు టాయిలెట్స్ మాత్రమే ఉన్నవని వీటిని పెంచాలన్నారు. కిష్టారం ఓసీలో రూ.20 లక్షల టన్నులకు పైగా బొగుత్పత్తి జరుగుతున్నది, కానీ నెలనెలా ఇన్సెంటు రావడం లేదని ఇన్సెంటి వచ్చే విధంగా ఏర్పాటు చేయాలన్నారు. ఆదివారాలు డ్యూటీలు కొంతమందికి మాత్రమే, మూడు కొందరికి, ఒకటి మాత్రమే ఇస్తున్నారని అందరికీ సమాన ప్రతిపాదికన రెండు ప్లేడేలు వచ్చే విధంగా యాజమాన్యం చర్యలు చేపట్టాలని ఈ వినతి పత్రంలో కోరారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ నాయకులు గాజుల రాజారావు, వై.వెంకటేశ్వరరావు, బి.ప్రకాష్, దువ్వ రమేష్ శ్రీరాములు పాల్గొన్నారు.