Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్‌ను అభినందించిన రాష్ట్ర మంత్రులు
నవతెలంగాణ-కొత్తగూడెం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహణపై జాతీయ స్థాయిలో అవార్డు సాధించడం పట్ల రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌లో వేరువేరు కార్యమ్రాల్లో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టిని శాలువా పూల, బొకేతో ఘనంగా సత్కరించారు. సోమవారం హైదరాబాద్‌లో మంత్రులు సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇరువురు మంత్రులు మాట్లాడుతూ నిరుపేదలు, నిరక్షరాస్యత, మారుమూల ప్రాంతాలు, గిరిజన గూడేలున్నా భద్రాద్రి జిల్లా పల్లెప్రగతి కార్యక్రమాలల్లో జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడం చాలా సంతోషమని చెప్పారు. ప్రభుత్వ మార్గదర్శకాలు అమలు చేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నారని మంత్రి అభినందించారు. ప్రజా ప్రతినిధులు, జిల్లా యంత్రాంగం సేవలతో పాటు ప్రభుత్వ లక్ష్యాన్ని తు.చ.తప్పక పాటిస్తున్న జిల్లా ప్రజలను మంత్రి అభినందించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కీర్తి ప్రతిష్ఠలు జాతీయ స్థాయికి చేర్చి ఆదర్శంగా నిలిచారని ఈ అవార్డు భద్రాద్రి జిల్లా ప్రజలకు లభించిన గొప్ప గౌరవమని వారు అభినందించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానీయా, పిఆర్డైరెక్టర్ హనుమంతరావు, జిల్లా గ్రామీణాభివృద్ధి పీడీ మధుసూదన్ రాజు, జిల్లా పంచాయతీ అధికారి రమాకాంత్, ఎస్బీయం కన్సల్టెంట్స్ రేవతి, ఖాదర్ పాల్గొన్నారు.